Advertisement
Google Ads BL

ఒకే ట్వీట్ తో ఫోర్ కొట్టేసిన మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాల హడావిడి ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో కనబడుతుంది. కొరటాల శివ తో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరు తాజాగా మోహన్ రాజా తో లూసిఫెర్ రీమేక్ కి కొబ్బరి కాయ కొట్టారు. ఫిబ్రవరి 11 నుండి లూసిఫెర్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే తాజాగా చిరు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తాను నెక్స్ట్ చెయ్యబోయే నలుగురు దర్శకులతో చిరు లూసిఫర్ రీమేక్ పూజ కార్యక్రమాలు రోజున దిగిన ఫోటో పోస్ట్ చేస్తూ.. నా 4 గురు కెప్టెన్స్.. ఈ నలుగురు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ఫోటో లో ఉన్న డైరెక్టర్స్ లో కొరటాల శివ తో చిరంజీవి ఆచార్య చేస్తుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఆచార్య తర్వాత లూసిఫెర్ రీమేక్.. ప్రస్తుతం ఆ సినిమా ఓపెనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత మెహెర్ రమేష్ తో వేదాళం రీమేక్ కి శ్రీకారం చుట్టారు మెగాస్టార్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో వేదాళం రీమేక్ చేస్తున్నారు చిరు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి సిస్టర్ కేరెక్టర్ లో సాయి పల్లవి కనిపించబోతుంది అనే న్యూస్ ఉంది. ఇక మెహెర్ రమేష్ సినిమా తర్వాత అసలు ఉంటుందో లేదో అనుకున్న బాబీ సినిమా కూడా ఉండబోతుంది అనే క్లారిటీ ఇచ్చారు ఈ ఫోటోతో చిరు. కొరటాల శివ తర్వాత మోహన్ రాజా ఆ తర్వాత మెహెర్ రమేష్.. చివరిగా దర్శకుడు బాబీ తో మెగాస్టార్ చిరు సినిమాని కె ఎస్ రామ రావు నిర్మిస్తున్నారు. రాబోయే నాలుగు సినిమాల డైరెక్టర్స్ ని చిరు ఇలా పక్కనబెట్టుకుని పరిచయం చేసారు. ప్రస్తుతం చిరు ట్వీట్ చేసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Megastar hits a four with just single tweet:

Chiru says my 4 captains, ee naluguru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs