Advertisement
Google Ads BL

పవర్ స్టార్ గెస్ట్ అప్పీరియన్స్


ఇటు వరసగా సినిమాలు ఒప్పేసుకుంటూ చకచకా తనకు తోచిన సినిమాలను చేసుకుంటూ పోతున్న పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో కూడా ఓ అడుగు వేస్తున్నాడు. అక్కడ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ లో ఎలా అయితే గెస్ట్ రోల్ కి ఎక్కువ, ఫుల్ లెంత్ రోల్ కి తక్కువ అనే కేరెక్టర్ చేసాడో.. పాలిటిక్స్ లో కూడా అదే రోల్ ప్లే చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా అదేం పట్టించుకోని పవన్ కళ్యాణ్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో తిరుపతి పర్యటనకు వెళ్ళాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, అలాగే ఓ ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ రేపు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించబోతున్నాడు.

Advertisement
CJ Advs

దానితో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గెస్ట్ అప్పీరియన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్మిడియట్ గా పొల్లాచ్చి వెళ్ళిపోయి రెండు నెలలుగా అంటే 45 డేస్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ పాలిటిక్స్ లో గెస్ట్ రోల్ కంప్లీట్ చేసుకోగానే.. అక్కడ పొల్లాచ్చిలో అయ్యప్పన్ కోషియమ్ సినిమా కోసం ఫుల్ లెంత్ రోల్ ప్లే చెయ్యడానికి సిద్దమవుతున్నాడు పవన్. ఆ సినిమా తర్వాత మళ్ళీ పాలిటిక్స్ అంటూ హడావిడి చేస్తూనే క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే చేతినిండా సినిమాలే కదా.. మరి రెండు పడవల ప్రయాణం అంటే ఇదే కదా.. 

Power Star Guest Appearance:

Pawan Kalyan To Travel On Two Boats
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs