Advertisement
Google Ads BL

బన్నీకి హ్యాండ్ ఇచ్చి.. ప్రభాస్ తో సై అంటాడా?


సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా లో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా.. విజయ్ సేతుపతి ముందు పుష్ప కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. కానీ అంతలోనే ఏమైందో పుష్ప సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. అప్పట్లో విజయ్ పుష్ప నుండి తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. కానీ విజయ్ సేతుపతి మాత్రం పుష్ప సినిమాలో నటించలేకపోతున్నందుకు ఫీలవుతున్నా అని, డేట్స్ అడ్జెస్ట్ కాలేదని, అన్ని విషయాలు సుకుమర్ తో మాట్లాడాకే ఈ సినిమా నుండి తప్పుకున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత విజయ్ సేతుపతి వదిలేసిన రోల్ కి సుక్కు బ్యాచ్ ఇంతవరకు మరో నటుడిని ఫైనల్ చెయ్యలేదు. అయితే అప్పుడు అల్లు అర్జున్ ని కాదన్న విజయ్ సేతుపతి ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటాడా? అనే ప్రశ్న అల్లు అభిమానులలో మొదలైంది.

Advertisement
CJ Advs

ఎందుకంటే ప్రభాస్ - కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సలార్ సినిమాలో విజయ్ సేతుపతిని ప్రభాస్ తో ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ సంప్రదిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సలార్ సినిమా ఈ మధ్యనే మొదలయ్యింది. రెగ్యులర్ షూట్ కి వెళ్ళేలోపు ప్రభాస్ ని ఢీ కొట్టబోయే విలన్ ఎంపిక అత్యవసరమట. అందుకే ఆ పాత్రకి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి అయితే బావుంటుంది అని.. ఈ మధ్యన మాస్టర్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటన చూసిన ప్రశాంత్ ఎలాగైనా సలార్ కి విలన్ గా విజయ్ సేతుపతినే సెట్ చెయ్యాలని ఆలోచిస్తున్నాడట. అందుకే విజయ్ సేతుపతిని సలార్ టీం సంప్రదించడానికి రెడీ అవుతుంది అనే న్యూస్ చూసిన అల్లు అభిమానులు ఫైర్ అవుతున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి సలార్ పాన్ ఇండియా మూవీని ఒప్పుకుంటాడా? అది చూస్తాం అంటున్నారు.

Vijay Sethupathi To Play Antagonist In Prabhas Salaar movie?:

Vijay Sethupathi Playing the negative role in Prabhas Salaar movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs