Advertisement
Google Ads BL

జైలు నుండి నేరుగా ఐసీయూలోకి..


జయలలిత నెచ్చెలి, జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లకు పైగా జైలు జీవితం అనుభవించి.. రీసెంట్ గా జైలు నుండి విడుదలయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. జయలలిత చనిపోయిన తర్వాత తమిళ రాజకీయాలను శాసిస్తాను.. నేనే సీఎం అంటూ జయలలిత సమాధి దగ్గర తొడకొట్టిన శశికళను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి జైలు కి పంపింది ఈడీ. బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఐదేళ్ల శిక్ష కాలానికి గాను నాలుగేళ్లు శిక్ష అనంతరం ఆమెకి పది కోట్ల జరిమానా చెల్లించి.. ఏడాది ముందుగానే విడుదల చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిగో ఇక శశికళ విడుదలై తమిళ రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతుంది అనేలోపు ఆమె అనారోగ్యంతో హాస్పిటల్ లోకి చేరింది.

Advertisement
CJ Advs

శశికళని నడుం నొప్పి, షుగర్, బిపి, శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్ లో చేర్చగా.. శశికళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం, తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లో శశికళను చేర్చారు. అయితే ఆమెని ఐసియూకి తరలించి చికిత్స చేస్తున్నట్టుగా డాక్టర్స్ ప్రకటించారు. శశికళ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా.. ఆమె ఆరోగ్యం క్షణక్షణానికి దిగజారుతున్నట్టుగా డాక్టర్స్ చెప్పడంతో శశికళ కుటుంబ సభ్యులు తీవ్ర అందోళనలో మునిగిపోయారు. ప్రస్తుతం ఐసియులో ఉన్న శశికళ కోలుకుని రావాలంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. మరి నాలుగేళ్ళు జైల్లో గడిపినా.. మళ్ళీ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న శశికళ ఇలా హాస్పిటల్ పాలవడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Directly from jail to ICU.:

Sasikala in Critical Condition
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs