Advertisement
Google Ads BL

తెరచాటు అందం.. ఎంత బాగుందో


నిన్నమొన్నటివరకు అవకాశాల విషయంలో అందరితో మాటలు పడిన సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ బడా మూవీస్ తో బాగా బిజీ అయ్యింది. తెలుగులో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేసిన రకుల్ నితిన్ తో చెక్ సినిమాలో నటిస్తుంది. తెలుగులోనూ, తమిళంలో పెద్దగా ఆఫర్స్ లేని రకుల్ ప్రీత్ బాలీవుడ్ సీనియర్ హీరోలకి బాగా కనెక్ట్ అయ్యింది. అమితాబ్ తో మేడే సినిమాలో నటిస్తున్న రకుల్ మరో బాలీవుడ్ మూవీ ని మొదలు పెట్టేసింది. అలాగే అర్జున్ కపూర్ తో మరో మూవీ కూడా చేసింది రకుల్. అజయ్ దేవగన్ దే దే ప్యార్ దే మూవీ కోసం బాగా బరువు తగ్గిన రకుల్ ని చూసిన చాలామంది రకుల్ పనైపోయిందని అన్నారట. ఆ విషయంలో రకుల్ చాలా ఫీలయినా ఆ సినిమా విజయం ఆమెకి సంతోషాన్ని ఇచ్చింది అని చెబుతుంది.

Advertisement
CJ Advs

ఇక ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, వ్యాయామం కూడా అంతే ముఖ్యమని అంటున్న రకుల్ ఎక్కువగా జిమ్ లోనే గడిపేస్తుంది. సినిమాలు ఉన్నా లేకపోయినా రకుల్ మాత్రం జిమ్ చెయ్యడం మానదు. అయితే తన గ్లామర్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే రకుల్ మాల్దీవుల్లో బికినీ రచ్చ తరవాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో రకుల్ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ అభిమానులని ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటాయి. అందుకే రకుల్ కూడా ఉత్సాహంగా తన అప్ డేట్స్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూడగానే తెరచాటు అందం.. ఎంత బాగుందో అంటారు. లూజ్ హెయిర్ తో చురకత్తుల్లాంటి చూపులతో.. ఓ క్లోత్ ని అడ్డం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న రకుల్.. పాతకాలపు హృదయంతో కొత్తగా చూడగలిగే కళ్ళతో, పాతకాలపు మనస్తత్వంతో(Just an old soul with young eyes and a vintage heart) అంటూ ఆ పిక్ కి క్యాప్షన్ కూడా పెట్టింది.  

Rakul's latest Social media post making her fans go aww!:

Captioned-Just an old soul with young eyes and a vintage heart!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs