Advertisement
Google Ads BL

మూవీ లవర్స్ కి క్రేజీ గిఫ్ట్ లు రెడీ


సంక్రాతి సీజన్ లో వీలైనంత రెవిన్యూని రాబట్టుకుని కాస్త కాసుల గలగలలు మళ్ళీ చవి చూసిన తెలుగు సినిమా పరిశ్రమ కరోనా క్రైసిస్ తర్వాత ఊపిరి పీల్చుకుంది. కొత్త ఉత్సాహంతో నెక్స్ట్ రిలీజ్ ల కోసం ముందడుగు వేస్తుంది. సంక్రాతి పెద్ద పండగ సందర్భంగా ఇప్పటికే కొన్ని కొత్త సినిమాల అప్ డేట్స్.. అంటే వకీల్ సాబ్ టీజర్ లాంటి కొత్త సినిమాల అప్ డేట్స్ తో ఆడియన్స్ లో ఊపు తీసుకొచ్చిన ఇండస్ట్రీ.. ఇప్పుడు మళ్ళీ జనవరి 26 అకేషన్ ని గట్టిగా వాడుకోబోతుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున టీజర్స్, అప్ డేట్స్, మూవీ కొత్త లుక్స్ మూవీ లవర్స్ కి కనువిందు చెయ్యబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్ ఆర్ ఆర్ గురించి. ఇద్దరి దేశ భక్తుల కథతో సినిమాని తీస్తున్న రాజమౌళి.. రిపబ్లిక్ డే రోజున ఆర్ ఆర్ ఆర్ కి సంబందించిన ఓ పర్టిక్యులర్ పెక్యులర్ వీడియోని రిలీజ్ చెయ్యబోతున్నారు.

Advertisement
CJ Advs

అలాగే ఎప్పుడూ సమాజానికి మంచి మెస్సేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కనిపించే కొరటాల శివ తాను తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో తానేమి చూపించబోతున్నారనే దానికి ఈ రిపబ్లిక్ డే రోజునే కర్టైన్ రైజెర్ అంటే టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. అలాగే న్యాయం చట్టం తరుపున పోరాడుతానని చెబుతున్న వకీల్ సాబ్ కూడా మరో చిన్న అప్ డేట్ తో ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. మరో పాన్ ఇండియా ఫిలిం కెజిఎఫ్ 2 నుండి ఓ అప్ డేట్ ఉండబోతుంది. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ నుండి  అప్ డేట్ కూడా రాబోతుంది.

అంతేకాకుండా BB3 బాలకృష్ణ - బోయపాటి సినిమా నుండి గత చాలా రోజులుగా ఏ అప్ డేట్ లేదని ఫాన్స్ నిరాశ పడుతున్న టైం లో జనవరి 26 కి వాళ్ళ నుండి ఓ కొత్త అప్ డేట్ రాబోతుంది. అందరూ ఆగిపోయింది అనుకుంటున్న శంకర్ - కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా ఫిబ్రవరిలో షూటింగ్ కాబోతుంది. ఆ విషయాన్నీ రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ఎనౌన్స్ చెయ్యబోతున్నారు. ఇక ఇవన్నీ పక్కనబెడితే రీసెంట్ గా క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ పుట్టిన రోజు కూడా జనవరి 26 నే కావడంతో అయన తాజా చిత్రం ఖిలాడీ టీం కూడా ఓ స్పెషల్ వీడియో తో.. క్రాక్ తో హిట్ కొట్టి ఊపుమీదున్న రవితేజని విష్ చేయబోతుంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాల అప్ డేట్స్ తో మూవీ లవర్స్ కి క్రేజీ గిఫ్ట్స్ రెడీ అవుతున్నాయి.

Crazy Gifts for Movie Lovers:

Republic day to have many Movie Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs