రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన క్రాక్ సినిమా జనవరి 9 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మాస్ మహారాజ్ ఎనేర్జిటిక్ పెరఫార్మెన్స్ తో క్రాక్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. సంక్రాతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త డల్ అవడంతో మాస్ రాజా కి బాగా కలిసొచ్చింది. పెద్దగా ఎక్సపెక్ట్షన్స్ లేకుండా థియేటర్స్ లో విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత సినిమాలు డిజాస్టర్స్ అవడంతో.. ఈ క్రాక్ సినిమా హిట్ రవితేజకి ఊపునిచ్చింది. ఇక మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన క్రాక్ సినిమా రెండో వారంలోనూ తగ్గలేదు.
క్రాక్ సినిమా ఇప్పటికి స్ట్రాంగ్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. కొన్ని చోట్ల క్రాక్ కోసం స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారంటే క్రాక్ ప్రభంజనం మాస్ ప్రేక్షకుల్లో ఎంత ఉందొ తెలుస్తుంది. విడుదల విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కున్న క్రాక్ సినిమా అవేమి లెక్క చెయ్యకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో అదరగొట్టేస్తుంది. మాస్ రాజా కెరీర్ లో క్రాక్ బెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది అని అంటున్నారు. మరోపక్క క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మెగా కాంపౌండ్ కాచుకుని కూర్చుంటే.. బాలయ్య బాబు నెక్స్ట్ సినిమాని గోపీచంద్ మలినేనితో కమిట్ చేయించేసారు మైత్రి మూవీస్ వారు. ఇక మాస రాజా రవితేజ కూడా క్రాక్ హిట్ ఉత్సాహంతో ఖిలాడీ షూట్ లో ఏకధాటిగా పాల్గొంటున్నాడు.
క్రాక్ 9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
👉నైజాం: 8.45
👉సీడెడ్: 4.49
👉అర్బన్ ఏరియాస్: 2.99
👉ఈస్ట్ గోదావరి : 2.29
👉వెస్ట్ గోదావరి: 1.85
👉గుంటూరు: 2.03
👉కృష్ణా: 1.72
👉నెల్లూరు: 1.35
ఏపీ అండ్ టీఎస్ టోటల్ :- 25.17 కోట్లు (41.65 గ్రాస్ )
కర్ణాటక అండ్ ఇతర ప్రాంతాలు: 1.28
ఓవర్సీస్: 0.66
టోటల్: 27.11కోట్లు (44.8 గ్రాస్ )