Advertisement
Google Ads BL

పుష్ప విలన్ పై కొనసాగుతున్న సస్పెన్స్


సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు అడవుల్లో ఏకధాటిగా అంటే సంక్రాంతికి గ్యాప్ అనేదే లేకుండా కష్టపడి పని చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప యూనిట్ మొత్తం రంపచోడవరం అటవీ ప్రాంతంలోనే తిష్టవేసుకుని కూర్చుంది. అయితే ప్రస్తుతం హీరో హీరోయిన్ పై ఓ సాంగ్.. అలాగే సినిమాలోని కీలక ఘట్టాల షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సినిమాకి విలన్ విషయంలో సస్పెన్స్ పెడుతూనే ఉన్నారు. విజయ్ సేతుపతి పుష్ప విలన్ రోల్ నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో చాలా పేర్లు చక్కర్లు కొట్టాయి. 

Advertisement
CJ Advs

అందులో ముఖ్యంగా వరుడు విలన్ తమిళ హీరో ఆర్య పేరు ప్రముఖంగా ప్రచారంలోకొచ్చింది. తర్వాత  బాబీ సింహా వరకు పుష్ప విలన్ లిస్ట్ లో చక్కర్లు కొట్టినా.. తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పేరు తెర మీదకి వచ్చింది. పుష్ప రాజ్ ని ఢీ కొట్టబోయే విలన్ విషయంలో సుకుమార్ ఎందుకింత సస్పెన్స్ కియేట్ చేస్తున్నాడో కానీ.. అల్లు అర్జున్ పుష్ప విలన్ విషయంలో రోజుకో పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. కానీ చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం లేదు. ఫైనల్ గా పాన్ ఇండియా లెవల్లో పుష్పకి ఎలాంటి విలన్ సెట్ అవవుతాడో కానీ.. పుష్ప రాజ్ విలన్ పై అల్లు అర్జున్ ఫాన్స్ లో అంతకంతకు ఆత్రుత, టెంక్షన్ మాత్రం పెరిగిపోతుంది.

Ongoing suspense over the Pushpa Movie villain:

Bobby deol to play Negative shaded role in Pushpa movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs