Advertisement
Google Ads BL

పవన్ ఫాన్స్ కి రెండు రీమేక్స్ పండగ


పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే తడవుగా వరస సినిమాలు ఒప్పేసుకుంటూ పవన్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. తమ హీరో రెండేళ్లు సినిమాల్లో లేకపోయినా.. మళ్ళీ వచ్చాక వరస సినిమాలు చేస్తున్నాడు అనే ఉత్సాహంలో పవన్ ఫాన్స్ ఉన్నారు. అందులోను ఐదు సినిమాలతో పవన్ టార్గెట్ పెట్టాడు. ఈ ఏడాది అందులో రెండు మూడు సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఫాన్స్ ఆనందాన్ని పట్టలేకపోతున్నారు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్.. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం క్రిష్ సినిమాకి బ్రేకిచ్చి ఏకే రీమేక్ షూటింగ్ కోసం తయారవుతున్నారు పవన్. అయ్యప్పన్ కోషియం రీమేక్ కి తక్కువ డేట్స్.. 45 రోజుల్లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేలా దర్శకుడు ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. 

Advertisement
CJ Advs

అంటే వేసవిలో వకీల్ సాబ్ రిలీజ్ రిలీజ్ ఉన్నా.. తర్వాత అయ్యప్పన్ కోషియం రీమేక్ దసరాకి రిలీజ్ ఉండొచ్చు. మరోపక్క క్రిష్ కూడా తాను పవన్ తో చెయ్యబోయే సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. క్రిష్ చకచకా షూటింగ్ కంప్లీట్ చేస్తుంటే పవన్ కూడా ముగ్దుడవుతున్నాడట. మరి క్రిష్ కి పవన్ పక్కా డేట్స్ ఇస్తే.. క్రిష్ సినిమా కూడా ఈ ఏడాదే దిగొచ్చని అనుకున్నారు. కానీ క్రిష్ ఈ ఏడాది పవన్ సినిమాని విడుదల చెయ్యడట. అంటే 2022 సంక్రాతి కి క్రిష్ - పవన్ సినిమా ఉండేలా క్రిష్ ప్లానింగ్ ఉందట. పవన్ తో చెయ్యబోయే సినిమాకి గ్రాఫిక్స్ కూడా కీలకం కావడంతో.. ఎలాంటి హడావిడి లేకుండా పవన్ డేట్స్ వినియోగించుకుంటూ సినిమాని పూర్తి చేసి హిట్ కొట్టాలని క్రిష్ కసిగా ఉన్నాడట. సో ఈ ఏడాది వకీల్ సాబ్, ఏకె రీమేక్ లతో పవన్ ఫాన్స్ కి పండగ చేసుకుంటారన్నమాట.

Two remakes festivals for Pawan Fans:

Pawan Kalyan Pink remake and AK remake to be released this year
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs