Advertisement
Google Ads BL

మెగా రీమేక్ ని మొదలుపెట్టేశారు


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ 153వ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్,  మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్  విక్కీ తదితరులు పాల్గొన్నారు.      

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంది అన్నారు.  

లూసిఫెర్ రీమేక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఏరి కోరి మరీ ఎంచుకున్నారు చిరు. బ్రుస్ లీ సినిమాలో తన రీ ఎంట్రీ కి ఎక్సట్రార్డినరీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని ఇంటికి పిలిపించుకుని మరీ మెచ్చుకుని ఆ రాప్ సాంగ్ ని విని పులకించిపోయిన మెగాస్టార్ ఇప్పుడు కంప్లీట్ గా థమన్ తోనే తన సినిమాని చేయించుకోబోతున్నారు. థమన్ కూడా తనకి ఈ రీమేక్ గోల్డెన్ ఆపర్చ్యునిటీ అని ఆల్రెడీ ట్వీట్ చేసాడు. సాంగ్స్ తక్కువున్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ స్కోప్ ఉండే ఈ సినిమాతో థమన్ ఎలా అదరగొడతాడో అది కూడా వేచి చూడాలి. రీసెంట్ గా థమన్ సినిమాలన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అవడంతో ఇప్పుడు లూసిఫెర్ రీమేక్ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడనగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.

ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ- మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్ లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

Megastar Chiranjeevi’s project was 153 launched:

<span>Megastar Chiranjeevi project #153 was launched ceremoniously at Super Good Office</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs