Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 1న స్టార్ట్.. ఇజ్జత్ కీ సవాల్


సైరా తో కనీసం నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ కొట్టేసి పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలనుకున్న సురేందర్ రెడ్డి ఫైనల్ రిజల్ట్ తో నాన్ స్టిక్ పాన్ అయిపోయారు. తన గ్లామర్ తో, డాన్సింగ్ స్కిల్స్ తో స్టార్ అయిపోదామనుకున్న అక్కినేని అఖిల్ హాట్రిక్ ప్లాప్స్ చవి చూసి తన నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినా సక్సెస్ ఫ్రూట్ టేస్ట్ చూపిస్తోందో లేదో అనే టెన్షన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరికి కావాల్సింది ఒకటే.. కరెక్ట్ సినిమా. వీళ్ళిద్దరికి రావాల్సింది ఒకటే.. కరెక్ట్ రిజల్ట్. ఇపుడు ఈ ఇద్దరు కలిసి కసిగా చేయనున్న సినిమా ఫిబ్రవరి 1 న లాంచ్ కానుంది.

Advertisement
CJ Advs

ఏకే ఎంటెర్టైమెంట్ బ్యానేర్ లో చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది. అఖిల్ ని, అఖిల్ పొటన్షియాలిటీని, అఖిల్ క్వాలిటీస్ ని సరిగ్గా ప్రాజెక్ట్ చేసేలా సురేందర్ రెడ్డి చాలా కేర్ తీసుకుని చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 1 న పూజ కార్యక్రమాలతో మొదలు కాబోతుంది. అఖిల్ కూడా సురేందర్ రెడ్డి సినిమా కోసం గత కొన్ని నెలలుగా స్పెషల్ గా హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈమధ్యన అఖిల్ హార్స్ రైడింగ్ వీడియోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తున్నాయి. మరి ఆ ట్రైనింగ్ అంతా సురేందర్ రెడ్డి మూవీ కోసమే అన్నమాట. ఇక అఖిల్ కి జోడిగా ముంబై టాప్ మోడల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా సురేందర్ రెడ్డి సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబోలో ఈసారి అఖిల్ కి పక్కా హిట్ ఖాయమంటున్నారు అక్కినేని అభిమానులు.

Akhil - Surender reddy Movie launch date locked:

Akhil - Surender Reddy film to start rolling from February 1st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs