Advertisement
Google Ads BL

రాధేశ్యామ్ సెట్స్ లో ఎమోషనల్ అయిన పూజ


ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రాధేశ్యాం షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ భారీ సెట్ లో ప్రభాస్ - పూజ హేగ్డ్ లపై సాంగ్ చిత్రీకరణతో పూజ హెగ్డే పాత్రకి సంబందించిన పార్ట్ కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్నీ పూజ హెగ్డే సోషల్ మీడియాలో తెలియజేసింది. అయితే రాధే శ్యాం సెట్స్ ని విడుస్తూ పూజ హెగ్డే తెగ ఎమోషనల్ అయ్యింది. ఏ బంధాన్ని అయినా తెంచుకోవాలకంటే చాలా కష్టం. అందులోను కొన్ని నెలలు కలిసి ప్రయాణం చేసిన వారిని వీడుతున్నామంటే అది మరింత బాధగా ఉంటుంది.

Advertisement
CJ Advs

చిన్న సినిమాలైతే కనీసం ఆరు నెలల షూటింగ్ ఉంటుంది. అదే పెద్ద సినిమా అయితే అది మరింత ఎక్కువ సమయం ఉంటుంది. సినిమా సెట్స్ లో ఎంతోమంది ఫ్రెండ్స్ అవుతారు. వారితో కలిసి కష్టనష్టాలను, ఆనందాన్ని పంచుకుంటాము. అదే సినిమా షూటింగ్ అవ్వగానే వెళ్ళిపోతున్నప్పుడు.. మళ్ళి ఆ యూనిట్ ని ఎప్పుడు కలుస్తామో తెలియదు. అలాంటప్పుడు చాలా బాధ కలుగుతుంది అంటూ పూజ హెగ్డే రాధేశ్యామ్ షూటింగ్ ముగించుకుని వెళ్ళుపోతూ ఎమోషనల్ అయ్యి అన్న మాటలు అవి. మరి రాధేశ్యాం ఫినిష్ అవడంతో బాలీవుడ్ లో రెండు సినిమా షూటింగ్స్ తో  పూజ హెగ్డే బిజీ కాబోతుంది. మరోపక్క తమిళ బడా ఆఫర్ కూడా పూజ కి తగిలినట్టుగా సోషల్ మీడియా టాక్.

Pooja hegde gets emotional on wrapping up Radhe shyam shoot:

Pooja Hegde Wraps Up Radhe Shyam Shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs