Advertisement
Google Ads BL

ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తా అంటున్న నాని


టిడిపిలో ఉండే కొడాలి నాని అనూహ్యంగా వైసిపిలోకి చేరి చంద్రబాబు నాయుడు, టిడిపిపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. అందులోను ఏపీ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక కొడాలి నాని మరింతగా రెచ్చిపోతున్నాడు. నోటికి అద్దు అదుపు లేని మాటలతో ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఈమధ్యన కొడాలి నాని నియోజకవర్గంలో ఆయన తమ్ముడు పేకాట స్థావరాలని నిర్వహిస్తూ పోలీస్ లకి దొరికిపోవడం.. బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఆ పేకాట, ఆయన తమ్ముడిపై విమర్శలు చేస్తున్న వారిపై నాని బూతులతో రెచ్చిపోతున్నాడు. ఏంటి దొరికితే లోపలికి వెళ్తాడు, బయటికొచ్చాక మళ్ళీ పేకాట ఆడతాడు అంటూ అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు కొడాలి నాని.

Advertisement
CJ Advs

తాజాగా కొడాలి నాని రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడు, పేకాటని ప్రోత్సహిస్తున్నాడు, ఆయన అసలు మంత్రిలాగా వ్యవహరించడం లేదంటూ టిడిపి నేత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన కొడాలి నాని.. దేవినేని ఉమని టార్గెట్ చేసాడు.. మా నియోజక వర్గంలో ఎవరో పేకాట ఆడుతుంటే మా పోలీస్ లు పట్టుకున్నారు. కానీ అదేదో మేమె చేపిస్తున్నామంటూ అవాకులు చవాకులు పేలుతున్న ఉమ.. ఇలాంటి మాటలు ఆపకపోతే ఇంటికొచ్చి బడిత పూజ చేస్తా అంటూ దేవినేని ఉమకి డైరెక్ట్ గా కొడాలి నాని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Kodali Nani vs Devineni Uma:

Dialogue war between Kodali Nani and Devineni Uma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs