Advertisement
Google Ads BL

40 రోజుల్లో 8 కిలోలు తగ్గిన హీరోయిన్


సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి గత రెండేళ్లలో సరైన హిట్ కాదు కదా సరైన అవకాశాలే లేవు. అలా అంటే రకుల్ ఊరుకోదు. ఎప్పుడు జిమ్ వర్కౌట్స్ తో బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడానికి కష్టపడి వర్కౌట్స్ చేసే రకుల్.. బాలీవుడ్ మూవీ కోసం సైజు జీరో లోకి మారి అందరికి షాకిచ్చింది. చక్కటి శరీర సౌష్టంతో ఉండే రకుల్ చబ్బీ చీక్స్ తో క్యూట్ గా స్వీట్ గా ఉండేది. కానీ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ దేదే ప్యార్ దే సినిమా కోసం చాల బరువు తగ్గి పీలగా తయారైంది. అప్పట్లో రకుల్ అంత సన్నగా తయారవడం చూసిన చాలామంది రకుల్ మరీ సన్నగా అందవిహీనంగా తయారైంది. ఆమెకి ఇంకేం అవకాశాలు వస్తాయని కామెంట్స్ కూడా చేసారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు రకుల్ ఆ విషయమై స్పందిస్తూ.. దేదే ప్యార్ దే సినిమా కోసం 40 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గాను అని, ఆ సినిమాలో నా పాత్ర కోసం అంత కష్టపడ్డాను. అక్షయ్ కుమార్, టబు లాంటి అనుభవజ్ఞులతో పని చేసే అవకాశం వచ్చింది. అలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని ఆ పాత్ర కోసం జిమ్లో నాలుగు గంటలు కష్టపడుతూ బరువు తగ్గి చాలా స్లిమ్ లుక్ లోకి మారాను. అప్పట్లో ఆ లుక్ పై చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. రకుల్ చాలా పీలగా తయారైంది. ఆమెకి ఇక అవకాశాలు రావడం కష్టమే, రకుల్ పనైపోయింది అంటూ కామెంట్స్ చేసారు. దానితో బాధపడినా కళ్ళు మీసుకుని దేనికి బాధపడకు, నీ పనే విమర్శకులకు సమాధానం చెబుతుంది అనుకున్నాను. అన్నట్టుగానే ఆ చిత్రం నాకు మంచి గుర్తింపుని తెపిచ్చిపెట్టింది అంటూ చెప్పుకొచ్చింది. 

The heroine lost 8 kilos in 40 days:

Rakul Preet Singh opens on weight loss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs