టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న హాట్ బ్యూటీ పూజ హెగ్డే ఇప్పుడు తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా హ్యాపీగా గడిపేస్తుంది. చేతినిండా సినిమాలున్న పూజ హెగ్డే పాన్ ఇండియా మూవీస్ తో పాటుగా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అదరగొట్టేస్తుంది. ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీ, అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ సినిమా సర్కస్ సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ ని పూర్తి చేసుకుని ఫ్రీ అయ్యింది.
నిన్నటివరకు రాధేశ్యాం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ప్రభాస్, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరణ పూర్తయ్యింది. ఆ సాంగ్ చిత్రీకరణతో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ నుండి ముంబై వెళుతున్నాను.. అంటూ పూజ తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. పూజ హెగ్డే పాత్ర షూటింగ్ అప్పుడే పూర్తయ్యింది అంటే.. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అవుతున్నట్టే.. త్వరలొనే రాధేశ్యాం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకునేలాగే కనబడుతుంది.