Advertisement
Google Ads BL

పవన్ ఫాన్స్ లో పస తగ్గిందా


పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ సినిమాలకు రెండేళ్లు గ్యాప్ ఇచ్చి ఆయన గత ఏడాది బాలీవుడ్ పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దానితో పవన్ ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేసింది.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ అప్ డేట్ ఏది వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకునేవారు. ఫస్ట్ లుక్ దగ్గరనుండి వకీల్ సాబ్ సెట్స్ నుండి లీకైన ఫోటో సవరకు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండేటట్లుగా పవన్ ఫాన్స్ పక్కా ప్లానింగ్ తో ఉండేవారు. పవన్ క్రేజ్ ని మరింత పెంచేలా పవన్ ఫాన్స్ చూసుకునేవారు. అందుకే జనవరి 14 న విడుదలయిన టీజర్ విషయంలోనూ పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసి పవన్ ని టాప్ లో నించోబెట్టాలనుకున్నారు.

Advertisement
CJ Advs

మరి జనవరి 14 సాయంత్రం ఎంతో గ్రాండ్ గా విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ని 24 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ కొట్టేసి ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్ లు కల టీజర్ గా సెట్ చేస్తామని ఏదేదో ఓ రేంజ్ ప్లానింగులు వేశారు. కానీ మూడు రోజులైనా  వాళ్ళ టార్గెట్ రీచ్ కాలేకపోయారు. పవన్ యాక్షన్ సీన్స్, పవన్ వకీల్ సాబ్ లుక్స్, అన్ని టీజర్ కి హైలెట్ గానే నిలిచాయి. కానీ రికార్డులు, లైక్ ల విషయంలో పవన్ ఫాన్స్ అనుకున్నది మాత్రం సాధించలేకపోయారు. మరి స్టార్ హీరోల ఫాన్స్ ముందు పవన్ ఫాన్స్ ఎక్కడో డల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ఇదంతా కెలవం పండగ హడావిడి వలనే అని.. చాలామంది ఫామిలీస్ తో బిజీగా ఉండడం వలన అనుకున్నది రిచ్ కాలేదు అని, అలాగే పవన్ ఓ రీమేక్ చెయ్యకుండా స్ట్రయిట్ మూవీ చేసుకుంటే గనక పవన్ క్రేజ్ మరింతగా పెరిగేదే అంటున్నారు. 

Has there been a washout in Pawan Fans?:

Pawan Fans could not reach the target in the case of Vakeel Saab
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs