ప్రస్తుతం అక్కినేని హీరోల్లో స్టార్ రేంజ్ కోసం అక్కినేని అఖిల్ తహతహలాడుతున్నాడు. అతను నటించిన మూడు సినిమాలు ప్లాప్ అవడంతో నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీదే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ అయినా తనకి హిట్ ఇస్తాడని అఖిల్ నమ్మకం పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కోసం వదిన సమంత రంగంలోకి దిగినట్లుగా వార్తలొస్తున్నాయి. అక్కినేని ఇంటి కోడలుగా సమంత నాగ్-అమల మనసు గెలుచుకుని కుటుంబానికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం అఖిల్ బాధ్యతను సమంత తీసుకుంది అని.. అతనికి ఎలాగైనా హిట్ కట్టబెట్టాలని సమంత ఓ పని చెయ్యబోతుందట.
అదేమిటంటే సమంత బాలీవుడ్ లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ దర్శకులు రాజ్ - డీకే త్రయం తమ తదుపరి సినిమా స్టోరీ సమంత కి చెప్పగా అది అఖిల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని, ఆ కథని అఖిల్ దగ్గరకి పంపి ఓకె చేయించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. ఒక పక్క తన కెరీర్ లో బిజీగా ఉంటూనే సమంత ఇప్పడు అఖిల్ కెరీర్ విషయంలో కేర్ తీసుకోవడానికి రెడీ అయ్యిందట. అందుకే రాజ్-డీకే చెప్పిన యాక్షన్ ఎంటెర్టైనెర్ అఖిల్ కి సూట్ అవుతుంది అని వాళ్ళకి చెప్పినట్టుగా టాక్. ఆ యాక్షన్ ఎంటెర్టైనెర్ అఖిల్ కి సరిపోతుంది అని, ఆ కథని మరొకరి దగ్గరకి వెళ్లకుండా సమంత జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోపక్క ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది.