మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలని ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. మంచు లక్ష్మి ఆమె కూతురు విద్య నిర్వాణ, మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ, మనోజ్ అంతా ట్రెడిషనల్ వెర్ డ్రెరస్సులతో ఫోటో షూట్స్ అంటూ హంగామా చెయ్యడమే కాదు.. ఈ సంక్రాంతి కనుమ రోజున మంచు విష్ణు భార్య వెరోనికా పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ పుట్టిన రోజు పార్టీకి మంచు ఫ్యామిలీతో పాటుగా ఘట్టమనేని మహేష్ ఆయన వైఫ్ నమ్రత అలాగే గోపీచంద్ వంటి సెలెబ్రేటిస్ హాజరై సందడి చేసారు.
ముఖ్యంగా మహేష్ - ఆయన భార్య నమ్రతానే ఈ పుట్టిన రోజు వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కరోనా టైం లో ఇంకా షూటింగ్స్ కి హాజరు కానీ మహేష్ , అలాగే పెద్దగా పార్టీలకు అటెండ్ కానీ మహేష్ ని ఆలా విష్ణు పార్టీలో చూసిన అభిమానులు ఉత్సాహ పడుతున్నారు. మహేష్ కొత్తగా న్యూ లుక్ లో అదరగొట్టేస్తున్నాడంటూ హ్యాపీ మోడ్ లో ఉన్నారు. మంచు విష్ణు తన భార్య నలుగురు పిల్లలతో ట్రెడిషనల్ గా మెరవగా .ఇంకొంతమంది సెలెబ్రెటీస్ ఈ వేడుకల్లో కలియతిరిగారు.