Advertisement
Google Ads BL

మాస్టర్ కి షాకుల మీద షాకులు


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన మాస్టర్ సినిమా విడుదలకు ముందే లీకుల రాయుళ్ల చేతికి దొరికిపోయింది. మాస్టర్ సినిమా మేజర్ సీన్స్ ఆన్ లైన్ లో విడుదలవడమే కాదు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విడుదలైన మాస్టర్ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. కనీసం మిక్స్డ్ టాక్ కూడా రాని మాస్టర్ కి ఇప్పుడు మరో సమస్య మొదలయ్యింది. అదే సినిమా విడుదలైన రెండో షో కె పైరసీ వచ్చెయ్యడం. తమిళనాట పైరసీ రాయుళ్లు ఎలాంటి హీరో సినిమా అయినా.. విడుదలైన నిమిషాల్లోనే ఆన్ లైన్ లో పైరసీ చెయ్యడం అనేది ఎప్పటినుండో జరుగుతున్న విషయమే. ప్రస్తుతం మాస్టర్ వంతు వచ్చింది.

Advertisement
CJ Advs

గత ఏడాది మార్చ్ లోనే విడుదల కావాల్సిన మాస్టర్ సినిమా కరోనా క్రైసిస్ వలన రిలీజ్ లేట్ అయినా.. సినిమాపై సోషల్ మీడియాలో మంచి బజ్ ఉండడంతో మాస్టర్ సినిమా లీకయినా మంచి క్రేజ్ తో అంచనాలతో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చారు. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం విజయ్ మాస్టర్ విఫలమైంది. మరోపక్క పైరసీ రాయుళ్లు మాస్టర్ సినిమా విషయంలో కనికరం చూపించకపోవడంతో అయ్యో పాపం మాస్టర్ అనాల్సి వస్తుంది.

Shocks upon shocks to master:

Piracy gets its hands on Master movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs