Advertisement
Google Ads BL

అఖిల కిడ్నాప్ కేసుకి అక్షయ్ కి లింకేమిటి?


కర్నూలు అంటే ఫ్యాక్షన్. ఫ్యాక్షనిజానికి రాయలసీమ పుట్టినిల్లు. ఇప్పుడు అక్కడి ఫ్యాక్షన్ కన్నా ఇక్కడ హైదరాబాద్లో జరిగిన కిడ్నాప్ ఒకటి హైలెట్ అయ్యింది. కర్నూలులో ఉండాల్సిన ఈ కిడ్నాప్ కి సూత్రధారి అయిన రాజకీయనేత భూమా అఖిల ప్రియా హైదరాబాద్ లోని చర్లపల్లి జైల్లో బెయిల్ కోసం ఎదురు చూస్తుంది. భర్త భార్గవ్ రామ్ అతని తమ్ముడు చంద్ర హాస్ కి  ప్లాన్ ఇచ్చి కొంతమంది వ్యక్తులతో కిడ్నాప్ కి ప్లాన్ చేసి తెలంగాణ పోలీస్ లకి అడ్డంగా దొరికిపోయిన అఖిల ప్రియా పోలీస్ కష్టడీలో రిమాండ్ లో ఉంది. కోర్టు ఆమెకి బెయిల్ మంజూరు చేయకపోవడంతో పోలీస్ కష్టడీలో అఖిల్ ప్రియకి నోరు విప్పక తప్పలేదు. అఖిల ప్రియా ఈ కిడ్నాప్ చెయ్యడం కోసం సదరు వ్యక్తులకి ఓ బాలీవుడ్ మూవీ చూపెట్టి దానిలో కిడ్నాప్ ఎలా చెయ్యాలో ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టుగా ఒప్పుకోవడంతో ఇప్పడు అందరూ షాకవుతున్నారు.

Advertisement
CJ Advs

సినిమాలు చూసి యూత్ చెడిపోతున్నారు అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఓ పొలిటికల్ నేత. అందులోని అమ్మాయి అయిన అఖిల ప్రియా ఇలా బాలీవుడ్ మూవీ చూసి కిడ్నాప్ కి ప్లాన్ చెయ్యడం షాకిచ్చే విషయమే. భర్త భార్గవ్ రామ్ తో కలిసి ఈ కిడ్నాప్ డ్రామా ఆడిన అఖిల ప్రియకి కీలక సాక్ష్యాధారాలు చూయించగా ఎట్టకేలకు అఖిల ప్రియ పెదవి విప్పి కిడ్నాప్ ప్లాన్ ఎలా వేసారో వివరించింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన ఓ యాక్షన్ సినిమాని భార్గవ్ తమ్ముడు చంద్ర హస్ అండ్ గ్యాంగ్ కి వివరించి ఆ సినిమా చూసి కిడ్నాప్ చేసే వ్యక్తులకి ట్రైనింగ్ ఇవ్వమని అఖిల ప్రియ చంద్ర హస్ గ్యాంగ్ తో చెప్పినట్టుగా పోలీస్ లా ముందు అఖిల ప్రియా చెప్పడమే కాదు.. దాని కోసం యూసుఫ్ గూడా లోని ఎంజిఎం స్కూల్ లో ట్రైనింగ్ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా చెప్పడంతో పోలీస్ లే షాక్ అయ్యారట.

అలాగే కిడ్నపర్స్ కి పోలీస్ అండ్ ఐటి అధికారులుగా ట్రైనింగ్ ఇవ్వడం, శ్రీనగర్ కాలనిలో సినిమా కంపెనీ నుండి ఐటి అధికారుల బట్టలు అద్దెకి తీసుకోవడం, వాళ్ళు ఐటి అధికారులుగా ఎలా నటించాలో పది రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం వంటి కీలక విషయాలను బయటపెట్టినట్టుగా పోలీస్ లు చెబుతున్నారు. మరి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ యాక్షన్ సినిమా ఇప్పుడు అఖిల ప్రియ కిడ్నాప్ డ్రామా కి హెల్ప్ అవడం మాత్రం నిజంగా షాక్ ఇచ్చే విషయమే.

Akhila Priya kidnap plan revealed:

Akhila Priya kidnap plan revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs