Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పెద్ద షాక్


రీసెంట్ గా పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటింగ్స్ కి అటెండ్ అవుతూ క్రిష్ సినిమా షూటింగ్ లోకి ఎంటర్ అయ్యిపోయాడు. జనవరి 11 నుండి పవన్ కళ్యాణ్.. క్రిష్ సినిమా సెట్ లో అడుగుపెట్టాడు. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన బ్యాలెన్స్ వర్క్ కంప్లెట్ చేసే పనిలో బిజీగా వున్నారు. ఈ మంత్ ఎండ్ అంటే ఇంకో టెన్ డేస్ క్రిష్ సినిమా కోసం కేటాయించిన పవన్ కళ్యాణ్.. వచ్చే నెలలో ప్రారంభం అయ్యే మలయాళం అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ కోసం గెటప్ మొత్తం చేంజ్ చేసెయ్యబోతున్నాడు. షార్ట్ హెయిర్ కట్, వైట్ బియర్డ్ ఈ లుక్ లో పవన్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పవన్ కి ఆ లుక్ ఎలా ఉంటుందో అనేది ట్రై చేస్తున్నారు.

Advertisement
CJ Advs

గెడ్డానికి రంగేసుకుని పవన్ తిరుగుతారు అది ఓకె. కానీ రంగులేని గెడ్డాన్ని మాత్రం ఫాన్స్ ఇప్పటివరకు చూడలేదు. గెడ్డానికి రంగు లేకుండా ఇంతవరకు పవన్ ఫాన్స్ ఆయన్ని ఎప్పుడూ చూసింది లేదు. తొలిసారి ఈ సినిమాతో ఆ గెడ్డాన్ని ఆయన చూపిస్తారా.. షార్ట్ హెయిర్ కట్, వైట్ బియర్డ్ తో పవన్ ఎలా ఉంటాడు, ఆయన లుక్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీని తాలూకు ఫోటో షూట్స్ కూడా జరగబోతున్నాయి. ఆ లుక్ ఓకె అనుకుంటే.. దానితో పవన్ కంటిన్యూ అవుతారు. ఎప్పుడూ పవన్ ని గ్లామరస్ గా సిల్కి హెయిర్ తో ఎక్సట్రార్డినరీగా చూసే పవన్ ప్యాన్స్ కి మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ ఒక రగడ్ లుక్ లో  కొత్తగా కనిపించి.. కేరెక్టర్ ని కేరెక్టర్ లా ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. మరి ఇది పవన్ ప్యాన్స్ షాక్ గా ఫీలవుతారా.. తృప్తిగా ఫీలవుతారా అనేది చూడాలి.

Big shock to Pawan Kalyan fans:

Pawan Kalyan to be seen in rugged look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs