స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫాన్స్ వార్ జరగడమనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని పోస్టర్ స్ మీద పేడ కొట్టుకునే అభిమానులు ఇప్పుడు సొంతంగా వాళ్ళ ఇష్టానికి విచిత్రమైన పోస్టర్స్ తయారు చేసి రిలీజ్ చేసే స్థాయికి వచ్చేసారు. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఈ రాద్ధాంతం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. తమిళ స్టార్ హీరోలైన విజయ్ - అజిత్ అభిమానుల మధ్యన ఎప్పటికప్పుడు ఈ ఫాన్స్ వార్ అనేది హద్దులు దాటేసి అరాచకాలు సృష్టస్తుంది. ట్విట్టర్ లో పచ్చి భూతులు ట్రెండ్ చెయ్యడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం ఇటువంటి విన్యాసాలన్నీ దాటిపోయిన అభిమానులు ఆపోజిట్ హారో సినిమాని లీక్ చేసే వరకు వచ్చేసారు.
అజిత్ నటించిన గత చిత్రం నీరుకొండ పారవై సినిమా విడుదల అప్పుడు చాలా సీన్స్ ని ఆన్ లైన్ లో లీక్ చేసారు విజయ్ ఫాన్స్. ఆ విషయాన్నీ మనసులో పెట్టుకుని వేటకుక్కల్లా కాచుకుని కూర్చున్నారు అజిత్ ఫాన్స్. కసితో ఉన్న అజిత్ ఫాన్స్ మాస్టర్ రిలీజ్ టైం కి నిజంగానే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. మాస్టర్ సినిమాలోని మేజర్ సీన్స్ అన్నింటీని కూడా లీక్ చేసి పడేసారు. లీక్ చెయ్యడమే కాదు.. వాటిని స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ తమిళ తంబిల అతి వాళ్లలో వాళ్ళు కొట్టుకోవడమేమో కానీ.. ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ ఫాన్స్ వార్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది.