Advertisement
Google Ads BL

రావిపూడిని రంగంలోకి దింపిన అల్లుడు


బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు అదుర్స్ అనుకోకుండా సంక్రాంతి బరిలోకి దిగినా.. సంక్రాంతికి తలపడే పందెం కోడి వలే ప్రమోషన్స్ విషయంలో దూసుకుపోతుంది. అల్లుడు అదుర్స్ సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ని గ్రాండ్ గా జరిగాయి. సోషల్ మీడియాలో అల్లుడు అదుర్స్ సినిమాపై బజ్ క్రియేట్ చెయ్యడానికి అదుర్స్ టీం ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ షేర్ చేస్తూ హంగామా చేస్తుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అల్లుడు అదుర్స్ కి ఈ ప్రమోషన్స్ చాలవనుకున్నట్లుగా ఉన్నారు. అందుకే చివరిగా కామెడీ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని రంగంలోకి దింపింది అల్లుడు అదుర్స్ టీం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించినా అనిల్ రావిపూడికి అల్లుడు అదుర్స్ సినిమాకి సంబంధం ఉందట. అంటే కామెడీ డైరెక్టర్ ఈ సినిమాకి ఏమైనా కామెడీ సహాయం చేసాడేమో అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే అల్లుడు అదుర్స్ ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడిని ఇన్వాల్వ్ చెయ్యడానికి ఆయనకున్న క్రేజ్ ఒక కారణమైతే, మరొకటి అల్లుడు అదుర్స్ సినిమా కి కామెడీ కరెక్షన్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అనిల్ రావిపూడి కామెడికి సంక్రాంతి ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. గత రెండేళ్లుగా అనిల్ కామెడీ ఎంటెర్టైనెర్స్ తో సంక్రాంతి ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాడు. ఎఫ్ 2 అలాగే గత ఏడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాలు సంక్రాంతికే విడుదలై సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. మరి ఇప్పుడు కూడా ఈ అల్లుడు అదుర్స్ కి అనిల్ కామెడీ తోడైతే బొమ్మ హిట్టే అంటున్నారు . అందుకే ప్రమోషన్స్ లోను అల్లుడు అదుర్స్ టీం అనిల్ రావిపూడి ని వాడేస్తుంది. 

Anil Ravipudi help for Bellamkonda Srinivas:

<h3 class="text-center">Anil Ravipudi On Inputs For Alludu Adhurs!</h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs