Advertisement
Google Ads BL

పవన్ ఫాన్స్ లో కంగారు మొదలయ్యింది


టాలీవుడ్ లో గబ్బర్ సింగ్, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించిన శృతి హాసన్ తర్వాత పవన్ కళ్యాణ్ తో నటించిన కాటమరాయుడు సినిమాతో కనబడకుండా పోయింది. కొన్నాళ్ళు బాయ్ ఫ్రెండ్, పెళ్లి అంటూ కబుర్లు చెబుతూ సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన శృతి హాసన్ మళ్ళీ టాలీవుడ్ సినిమాలతో రీ ఎంట్రీ చ్చింది. గతంలో తనకు హిట్ ఇచ్చిన రవితేజ సరసన క్రాక్ సినిమా తో పాటుగా క్రేజీ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో పవన్ భార్య పాత్రని పట్టేసింది. ఇక ఎయిర్ పోర్ట్ లో శృతి మాస్క్ లుక్స్, ఆమె ఫిజిక్ చూసిన వారు శృతి ఈజ్ బ్యాక్ అన్నారు.

Advertisement
CJ Advs

శృతి హాసన్ రీ ఎంట్రీ ఇచ్చిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రాక్ సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ రాగా.. శృతి హాసన్ పాత్రకి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. శృతి హాసన్ లుక్స్ లో తేలిపోవడమే కాదు..  శ్రుతిహాస‌న్ ఈ సినిమాలో చాలా చిన్న పాత్ర లో నటించింది. తాను నటించడానికి పెద్దగా స్కోప్  లేకుండా పోయింది. శ్రుతి హాసన్ లో ఇంతకుముందున్న గ్రేస్ లేదు. చాలా కృత్రిమంగా తయారైంది ఆమె అవతారం అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఒక ఎలివేషన్‍ సీన్‍లో కూడా చాలా ఆడ్‍ అనిపించింది. లుక్ అంతంతమాత్రం అంటే.. మేకప్ కూడా భరించలేని విధంగా ఉంది చాలా చోట్ల అంటున్నారు ప్రేక్షకులు. 

ఎన్నో ఆశలతో శృతి హాసన్ రీ ఎంట్రీ సక్సెస్ అవుతుంది అనుకుంటే.. ఇప్పడు క్రాక్ లో శృతి లుక్స్ చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ బెంగ పెట్టుకుంటున్నారు. వకీల్ సాబ్ లో శృతి హాసన్ ఎలా ఉంటుందో.. గతంలో కాటమరాయుడు ప్లాప్ లో కూడా శృతి హాసన్ లుక్స్ కూడా భాగమయ్యాయి అంటూ బెంగపడిపోతున్నారు పవన్ ఫాన్స్. 

The commotion started in Pawan Fans:

Shruti Haasan's looks worrying Pawan's fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs