Advertisement
Google Ads BL

దేవరకొండకి షాకిచ్చిన బాలీవుడ్ హీరో!


విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలింలో నటిస్తున్నాడు. కరోనా క్రైసిస్ వలన ఆగిన షూటింగ్ .. ఈ నెల 20 నుండి మొదలు కావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. కానీ యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. పూరి కానీ, విజయ్ దేవరకొండ కానీ అటు హిందీ నిర్మాత కరణ్ జోహార్ కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ఉన్నారు. పూరి - ఛార్మి లు ముంబై ఆఫీస్ ఓపెన్ చేసుకుని మిగతా పనులు చక్కబెడుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ - పూరి సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫైటర్ లుక్ నే ఫాలో అవుతున్నాడు. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోని పాన్ ఇండియా ఫిలింగా అనుకోకముందు ఆ కాంబో కి ఫైటర్ అంటూ టైటిల్ ఫిక్స్ చేసారు. కానీ ఆ సినిమా పాన్ ఇండియా కి వెళ్ళగానే టైటిల్ అన్ని భాషలకు సరిపోయేలా పెట్టాలని.. ఆల్రెడీ టైటిల్ విషయం ఓ కొలిక్కి వచ్చింది అని ఆ సినిమా నిర్మాత ఛార్మి ఓ మంచి రోజు చూసి అనౌన్స్ చేస్తామని చెప్పారు కూడా.

Advertisement
CJ Advs

ఇక పూరి - విజయ్ సినిమా ఇప్పటికి ఫైటర్ టైటిల్ తోనే ప్రచారంలో ఉంది. ఇప్పుడు విజయ్ ఫైటర్ కి బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్ షాకిచ్చాడు. తన కొత్త సినిమాకి ఫైటర్ టైటిల్ పెట్టి అనౌన్స్ కూడా చేసేసారు. హ్రితిక్ రోషన్ - దీపికా పదుకొనె హీరో హీరోయిన్స్ గా బాలీవుడ్ లో ఫైటర్ పేరుతో సినిమా మొదలైపోయింది. మరి ఎప్పటినుండో విజయ్ - పూరి సినిమా ఫైటర్ గా తెగ పాపులర్ అయ్యింది. ఒకవేళ దాని క్రేజ్ చూసి అదే పెడదామని పూరి వాళ్ళు ఫిక్స్ అవడానికి లేకుండా హ్రితిక్ ఇప్పుడు టైటిల్ వీడియోతో హిందీ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చి.. విజయ్ దేవరకొండకి షాకిచ్చాడు. 

Bollywood hero gives a shock to Devarakonda!:

Hrithik roshan's new movie titled 'Fighter'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs