Advertisement
Google Ads BL

ఫ్యామిలీ - ఫాన్స్ మధ్యన ఇరుక్కున్న రజిని


తమిళనాట రజినీకాంత్ కి వీరాభిమానులు ఉన్నారు. ఏ సౌత్ స్టార్ కి లేని అభిమాన గణం రజినీకాంత్ సొంతం. ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరిగిఉంటే ఈపాటికి రజినీకాంత్ రాజకీయ పార్టీ తమిళనాట రాజకీయనేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేది. జనవరిలో పార్టీ ప్రకటన ఉంటుంది అంటూ డిసెంబర్ లోనే ఊరించిన రజినీకాంత్ ఆరోగ్యపరమైన కారణాలు, కుటుంబ ఒత్తిడి వలన రాజకీయ రంగ ప్రవేశం విరమించుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న రజినీకాంత్ కీ కుటుంబం అండగా ఉంది. ఆయన కూతుళ్లు రాజకీయాలు వదిలేయ్ నాన్నా.. ఆరోగ్యం కన్నా రాజకీయాలు ముఖ్యం కాదని చెప్పడంతోనే రజిని రాజకీయాలకు దూరమవుతున్నారు. అదే కుటుంబం సినిమాల విషయంలోనూ, ఆయన ఆరోగ్యం విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు.

Advertisement
CJ Advs

అందుకే రజిని సినిమాల విషయంలోనూ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారని.. సినిమాలకు శాశ్వతంగా దూరమవుతారనే ప్రచారాన్ని ఆయన అభిమాన గణం తట్టుకోలేకపోతుంది. తాజాగా రజిని అభిమానులు రజినీకాంత్ ఇంటి ముందు ఆందోళనలు, ఆవేశపడడాలు లాంటివి చేస్తున్నారు. అసలే ఆరోగ్యపరమైన ఒత్తిడిలో ఉన్న రజినీకాంత్ అభిమానుల అభిమానం తోనూ మరో వైపు అనుబంధాలు అయిన కుటుంబం విషయంలోనూ నలిగిపోతున్నట్లే కనబడుతుంది. శివ దర్శకత్వంలో రజిని హీరోగా తెరకెక్కుతున్న అన్నత్తై షూటింగ్ ముగియగానే రజిని సినిమాలనుండి తప్పుకోవడం ఖాయం అంటూ ప్రచారం జరగడంతో అభిమానుల ఆందోళన మరింత ఎక్కువైంది. మరి కుటుంబం తన ఆరోగ్యం విషయంలో టెంక్షన్ పడడంతో సైలెంట్ గా ఉంటున్న రజినీకి మరోపక్క అభిమానుల ఆందోళన మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

Hero torn between fans and bonds:

Rajinikanth trapped among fans and family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs