Advertisement
Google Ads BL

సునీత పెళ్లి లో హీరో గారు వైఫ్ తో కలిసి..


సింగర్ సునీత - యూట్యూబ్ ఓనర్ మ్యాంగో రామ్ ల వివాహ మహోత్సవం గత రాత్రి ఓ టెంపుల్ లో అంగరంగ విభావగా జరిగింది. గుళ్లో పెళ్లి, సింపుల్ పెళ్లి అంటూ ప్రచారం జరిగినా సునీత సెకండ్ మ్యారేజ్ మాత్రం గ్రాండ్ గా అతిధులు, సన్నిహితుల మధ్యన జరిగింది. తన పిల్లల ముందు సునీత సిగ్గుపడుతూ రామ్ తో కలిసి ఏడడుగులు వేసింది. ఇప్పటివరకు సునీత ఇచ్చిన గ్రాండ్ పార్టీలు, సునీత పసుపు ఫంక్షన్, మెహిందీ వేడుకలు, పెళ్లి కూతురు ఫంక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్టే.. ఇప్పుడు సునీతా పెళ్లి వేడుకలు అదే విధంగా వైరల్ అయ్యాయి. మరి సునీత పెళ్ళిలో మెయిన్ సెంట్రాఫ్ అట్రాక్షన్ ఎవరయ్యా అంటే హీరో నితిన్. హీరో నితిన్ తన భార్య శాలినితో పాటుగా సునీత పెళ్లి లో సందడి చేసాడు.

Advertisement
CJ Advs

మ్యాంగో రామ్ కి అత్యంత సన్నిహితుడైన నితిన్ గతంలో సునీత - రామ్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి హోస్ట్ గా చెయ్యడం చర్చనీయాంశం అయినట్టుగా ఇప్పుడు వీళ్ళ పెళ్ళిలో నితిన్ భార్య తో కలిసి పాల్గొనడం అంతే చర్చనీయాంశం అయ్యింది. హీరో నితిన్ - భార్య షాలిని లు కలిసి ఓ పబ్లిక్ ఫంక్షన్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మూడు రోజుల క్రితమే తిరుమల తిరుపతికి వెళ్లి కాలినడకన శ్రీ వారి మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకుని భార్య షాలిని పుట్టిన రోజు వేడుకలని ఘనంగా నిర్వహించిన నితిన్ మళ్ళీ సునీత పెళ్లి లో కనిపించడం ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది. మరి సునీత పెళ్లి వీడియో అలాగే ఫొటోస్ లో నితిన్ ఆయన భార్యనే మెయిన్ ఏట్రాక్షన్. ఇంకా ఈ పెళ్ళికి అనిత చౌదరి, సుమ కనకాల, ఆర్పీ పట్నాయక్, తెలంగాణ మంత్రి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

Nithin and his wife at Sunitha's wedding:

Singer Sunitha - Ram Wedding video goes viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs