Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్.. రిలీజ్ ఎప్పుడంటే..


నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేస్తే.. నేడు వకీల్ సాబ్ యూనిట్ షూటింగ్ చక్కబెట్టేసింది. గత ఏడాది జనవరిలో షూటింగ్ మొదలు పెట్టుకున్న వకీల్ సాబ్ మళ్ళీ జనవరి నెలలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం ఆశ్చర్యకర విషయమే అయినా.. కరోనా అన్ని మార్చేసింది. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో హడావిడి చేస్తున్నాడు. అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వకీల్ సాబ్ రిలీజ్ డేట్ కూడా దిల్ రాజు-వేణు శ్రీరామ్ త్వరలోనే ప్రకటించబోతున్నారని అంటున్నారు. షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్న వకీల్ సాబ్.. టీజర్ సంక్రాంతి పండగ అంటే జనవరి 14 న విడుదలకి ప్లాన్ చేసింది టీం.

Advertisement
CJ Advs

ఇక సినిమా ఏప్రిల్ 9 న విడుదల చేసే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. మాములుగా ఈ సంక్రాంతికి వకీల్ సాబ్ ని దింపి సెంటిమెంట్ రిపీట్ చెయ్యాలని దిల్ రాజు కలలు కన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ పనుల వలన అది నెరవేరలేదు. కూల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వేసవి బరిలో నిలిచేందుకు దిల్ రాజు కూడా కామ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మంచి డేట్ చూసి అంటే ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ విడుదల చేస్తే బావుంటుంది అని దిల్ రాజు బ్యాచ్ ఆలోచనగా చెబుతున్నారు.

Vakeel Saab Shooting Finish .. Release Date?:

Pawan Kalyan Vakeel saab release date locked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs