Advertisement
Google Ads BL

మధ్యలో బలైన రవితేజ


రవితేజ నటించిన మాస్ ఎంటర్టైనర్ క్రాక్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. గత రాత్రే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అంటూ క్రాక్ టీం పబ్లిసిటీ కూడా చేసింది. అలాగే ఇండియాలో ఈ రోజు ఉదయం 8.45 గంటలకు మల్టీప్లెక్స్ షోస్ పడాల్సి ఉండగా.. క్రాక్ షోస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. గత రాత్రి ఓవర్సీస్ షోస్ దగ్గరనుండి ఈ రోజు ఉదయం 8.45 షోస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. అసలే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. అందులోని కరోనా. ఏదో విధంగా అన్ని అంటంకాలు అధిగమించి సినిమాని విడుదల చేసుకుందామనుకుంటే  మధ్యలో విడుదల లేట్. షోస్ క్యాన్సిలయ్యి ఫాన్స్ కి చిరాకు తెప్పించారు. చాలా రోజుల తర్వాత డబ్బులు పెట్టి టికెట్ కొని థియేటర్స్ కి వెళ్ళిన ప్రేక్షకులు ఉస్సురుమంటూ  ఇంటి దారి పట్టారు. కారణం క్రాక్ సినిమా షోస్ రద్దవడమే.

Advertisement
CJ Advs

అసలు షోస్ రద్దవ్వడానికి మెయిన్ కారణం క్రాక్ నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య తలెత్తిన విభేదాలే కారణమట. గతంలో విడుదలైన ఓ డబ్బింగ్ సినిమా లావాదేవీలు ఇప్పటికి తెగనందున ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ క్రాక్ బొమ్మ పడకుండా అడ్డుకున్నారు. వీళ్లిద్దరి మధ్యన అంటే డిస్ట్రిబ్యూటర్స్ - క్రాక్ నిర్మాత మధ్యన రవితేజ ఇరుక్కున్నాడు. ఉదయం షోస్ మాత్రమే కాదు.. 10 గంటల షోస్ కూడా రద్దయి.. ఇప్పుడు చివరికి అసలు సినిమా విడుదల అవుతుందా అనేది అనుమానంగా మారింది. ఎప్పుడూ ఓవర్సీస్ టాక్ అంటూ సినిమా విడుదల అయ్యే సమయానికల్లా సినిమా టాక్స్ సోషల్ మీడియాలో పాకేసేది. సినిమా థియేటర్స్ లో దిగగానే జనాలు ట్విట్టర్ రివ్యూస్ అంటూ హడావిడి చేసేవారు. ఈ రోజు క్రాక్ సినిమా చూడడానికి ఉత్సాహంగా బయలు దేరిన సినిమా ప్రియులకు బొమ్మ ఎప్పుడు పడుతుందో తెలియక వెర్రి చూపులు చూస్తున్నారు.

Raviteja gets fooled in the middle!:

Krack release in trouble
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs