Advertisement
Google Ads BL

చైతూకి థాంక్యూ చెబుతోన్న అవిక


మనం తర్వాత మళ్ళి విక్రమ్ కె కుమార్ తో దిల్ రాజు బ్యానర్ లో నాగ చైతన్య చేస్తున్న మూవీ థాంక్యూ. మనం సినిమాతో భారీ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈమధ్యనే షూటింగ్ ప్రారంభమైన. ఈ సినిమాలో నాగ చైతన్య జోడిగా ముగ్గురు ముద్దు గుమ్మలు నటించబోతున్నారని టాక్ ఉంది.  అందులో ఒక హీరోయిన్ గా చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ నటిస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య - అవికా గోర్ కాంబినేషన్స్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చి బరువు తగ్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారై వరస ఆఫర్స్ పట్టేస్తుంది. అందులో నాగ చైతన్య థాంక్యూ ఒకటి.

Advertisement
CJ Advs

ఇక మరో హీరోయిన్ గా నాగ చైతన్య సరసన చైతు భార్య సమంత నటించబోతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24, మనం సినిమాలు చేసిన సమంత ఇప్పుడు విక్రమ్ కుమార్ చెప్పిన థాంక్యూ కథ విని ఒప్పుకోవడమే కాదు.. ముగ్గురు హీరోయిన్స్ అన్నప్పటికీ సమంత ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది. మరి పెళ్లి తర్వాత చైతు -సమంత కాంబోలో వచ్చిన మజిలీ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ జంట సమంత - చైతు కలిసి నటిస్తారనగానే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరగడం మాత్రం ఖాయం. అయితే ఈ సినిమాలో సమంత మరో హీరోయిన్ అనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక మూడో హీరోయిన్ ఎవరనేది థాంక్యూ టీం త్వరలోనే ఫైనలైజ్ చేస్తారని తెలుస్తుంది.

Avika saying thank you to Chaithu:

Avika gor in Naga Chaitanya - Vikram k Kumar Thank you movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs