Advertisement
Google Ads BL

పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫాన్స్!


ప్రభాస్ వరసగా క్రేజియస్ట్ పాన్ ఇండియా మూవీస్ ని లైన్ లో పెడుతున్నాడు. రాధేశ్యాం తో పాటుగా నాగ శ్విన్, అలాగే ఓం రౌత్ ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ సలార్ అన్ని క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్. వీటన్నిటిలో రాధేశ్యాం విషయంలో ఎక్కడైనా లెక్క తేడా కొట్టొచ్చేమో కానీ.. మిగతా మూడు భారీప్రాజెక్ట్స్ పై మంచి అంచనాలు, భారీ క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ లైన్ అప్ తో చాలా హ్యాపీ గా ఉన్నారు. గత ఏడాది కరోనా వలన ప్రభాస్ సినిమాలేవీ విడుదల కాకపోయినా ఈ ఏడాది రెండు సినిమాల ట్రీట్స్ ప్రభాస్ నుండి రావడం పక్కా అని ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. తాజాగా ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ లైనప్ విషయంలో పండగ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అంతే ఆదిపురుష్, అలాగే నాగ్ అశ్విన్ మూవీస్ ఉన్నాయి కదా. ముందు అవి పూర్తయ్యాకే తర్వాత సినిమా కమిట్ అవుదామని ఆలోచించకుండా ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ అనౌన్స్ చేసి మంచి పని చేశాడంటూ ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ స్టార్ హీరోలని మాస్ గా చూపించడంలో ఎంత పెద్ద క్రేజీ డైరెక్టరో తాజాగా విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ నిదర్శనం. యాష్ ని మాస్ గా కాదు.. ఊర మాస్ గా చూపిస్తూ.. హీరోని ఎంతగా ఎలివేట్ చెయ్యాలో, అలాగే హీరో మాస్ స్టయిల్ , మాస్ లుక్స్ అన్ని ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టయిల్ ని తెలియజేస్తున్నాయి. ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు ఎలా ఉన్నా సలార్ తో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో మాస్ గా అదరగొట్టడం ఖాయం. సాలార్ ఫస్ట్ లుక్ లోనే ప్రభాస్ మాసివ్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడం కూడా ఇందుకు నిదర్శనమే అంటున్నారు ఫాన్స్..

ఇక ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రభాస్ రేంజ్ ని మరింతగా పెంచడం ఖాయమని, సలార్ లో ఎన్నడూ చూడని మాస్ ప్రభాస్ ని చూడబోతున్నాం ఇది ఫిక్స్ అంటూ ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Prabhas fans are very eager after seeing this!:

After seeing KGF 2 teaser Prabhas fans are keen to see what Prashanth will do with Salaar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs