Advertisement
Google Ads BL

బన్నీ నీకవసరమా ఇవన్నీ


తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలయ్యాక చాలా సినిమాలొచ్చాయి. పెద్ద పెద్ద హిట్స్ అయ్యాయి. మాయ బజార్ దగ్గరనుండి బాహుబలి వరకు.. చాలా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ ఒక హిట్ ని ఇంతిలా పబ్లిసిటీ చెయ్యలేదు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ క్రేజ్ ని ఆ ఇమేజ్ ని షోల్డర్ చేస్తున్న బన్నీ గత కొన్ని నెలలుగా అంటే ఒక ఏడాదిగా.. తనని తానే మెగాస్టార్ గా అభివర్ణించుకుంటూ ఇప్పుడు 11 వ తారీఖున అలా వైకుంఠపురములో విడుదలై ఏడాది గడుస్తున్న సందర్భంగా అలా వైకుంఠపురములో యూనిట్ రీ యూనియన్ పార్టీ ఒకటి ఓ రేంజ్ లో ప్లాన్ చేసాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన చిరంజీవి కానీ, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బాలయ్య కానీ.. ఖుషి, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కానీ.. పోకిరి, శ్రీమంతుడు  లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్  కొట్టిన మహేష్ కూడా ఇలాంటి సెలెబ్రేషన్స్ చేసుకోలేదు.

Advertisement
CJ Advs

ఇక రంగస్థలం కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టిన సినిమా. కానీ రామ్ చరణ్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు. ఇక టెంపర్ నుండి అరవింద సమేత వరకు కంటిన్యూస్ గా తారక్ ఐదు హిట్స్ ఇచ్చి కూడా సైలెంట్ గానే ఉన్నాడు. మరి అలా వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ గత ఏడాది నుండి ఆ సాంగ్స్ రికార్డ్స్ తోనో, లేదంటే కలెక్షన్స్ తోనో ఏదో ఒక విషయంలో ఆ సినిమా విజయాన్ని ఇంకా భుజాన మోస్తూనే ఉన్నాడు. అంతమంది అన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా.. కామ్ గా వున్నారు. అయితే బన్నీ ఇవన్నీ చేసి ఏం చూపించాలనుకుంటున్నాడు? అభిమానులకి, ఇండస్ట్రీకీ ఏం చెప్పాలనుకుంటున్నాడు.? అసలు బన్నీ అలా వైకుంఠపురములో సినిమా విషయంలో చేసే హడావిడి చూసిన వారంతా బన్నీ నీకవసరమా ఇవన్నీ.. అంటూ కామెడీ చేస్తున్నారు. 

Satires on Ala Vaikunthapurramuloo team decision about 365 days Celebrations:

Ala Vaikunthapurramuloo team plans for one year celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs