Advertisement
Google Ads BL

కెజిఎఫ్ 2 రాఖి భాయ్ అరిపించేసాడు


ప్రశాంత్ నీల్ - యాష్ కాంబోలో కన్నడలో తెరకెక్కిన కెజిఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లో కలెక్షన్స్ వర్షం కురిపించింది. యాష్ ని మాస్ హీరోగా ప్రపంచానికి పరిచయం చేసాడు ప్రశాంత్ నీల్. కన్నడలో హీరోగా పేరు తెచ్చుకున్న యాష్ కెజిఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కెజిఎఫ్ లో మాస్ హీరోగా, హీరో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు అన్ని అద్భుతంగా తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ తో అద్భుతమైన హిట్ కొట్టారు యాష్ అండ్ ప్రశాంత్ నీల్ లు. ఎటువంటి అంచనాలు లేని మాస్ కమర్షియల్ గా తెరకెక్కిన కెజిఎఫ్ అంత పెద్ద హిట్ అవడంతో.. కెజిఎఫ్ చాప్టర్ 2  రాక కోసం అందరూ ఆక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా క్రైసిస్ వలన ఏడాది పాటు కెజిఎఫ్ చాప్టర్ 2 అప్ డేట్ లేకపోయినా మధ్యమధ్యలో కెజిఎఫ్ చాప్టర్ 2 పోస్టర్స్ తో అభినులను హ్యాపీగానే ఉంచింది టీం.

Advertisement
CJ Advs

జనవరి 8 న యాష్ పుట్టిన రోజు పురస్కరించుకుని కెజిఎఫ్ టీం కాస్త ముందుగానే అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చింది. గురువారం రాత్రే కెజిఎఫ్ 2 టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేసి షాకిచ్చారు. అమ్మ మాట కోసం కెజిఎఫ్ లోకి అడుగుపెట్టి.. తెలివితేటలతో ఒంటరిగా గరుడ అనే మహా సముద్రాన్ని ఢీ కొట్టి.. గరుడని చంపి కెజిఎఫ్ కి రాజు ఎలా అయ్యాడో చాప్టర్ వన్ లో చూపిస్తే.. చాప్టర్ 2 లో గరుడ చావుతో కెజిఎఫ్ కి వచ్చిన అధీరా ని  రాఖి భాయ్ ఎలా ఎదుర్కొన్నాడో అనేది చాప్టర్ 2 లో దర్శకుడు చూపించబోతున్నాడనేది ఈ టీజర్ లో అర్ధమవుతుంది. ప్రశాంత్ నీల్ హీరో ఎలివేసిషన్ సీన్స్, హీరో ఎంట్రీ సీన్స్, విలన్స్ కెజిఎఫ్ కి పయనమయ్యే సీన్స్, రాఖీ భాయ్ ని ప్రెజెంట్ చేసిన తీరు, బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అన్ని అత్యంత అద్భుతం.

కెజిఎఫ్  టీజర్ గూస్ బమ్స్ కలిగిస్తోంది. ఇక టీజర్ చివర్లో యాష్ రాఖి భాయ్ గా మెషిన్ గాన్ తో జీపులని పేల్చివేసే సీన్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. మరి హోంబలే ఫిలింస్ వారు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారని కెజిఎఫ్ 2 టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

KGF Chapter 2 teaser review:

Yash - Prashanth neel KGF Chapter 2 teaser released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs