Advertisement
Google Ads BL

పాలిటిక్స్ అంటే భయపడుతున్న పవన్.


పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు, సినిమాలు రెండు కళ్ళు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్న పవన్ సినిమాల కథల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారట. మంచి మంచి కమర్షియల్ ఎంటెర్టైమెంట్ అందించే కథలకు ఓకె చెబుతున్నారు. ఆయన సినిమాలకు పాలిటిక్స్ కి లింక్ లేకుండా ఉన్న కథలనే ఇంతవరకు ఒప్పుకుంటూ వస్తున్నారు. అంటే వకీల్ సాబ్ దగ్గర నుండి, క్రిష్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమా, అలాగే అయ్యప్పమ్ కోషియమ్ ఇలా వరసగా కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ నే పవన్ కోరుకుంటున్నారు కానీ.. తన సినిమాల్లో పొలిటికల్ టాపిక్ కానీ, అలాగే డైలాగ్స్ కానీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాలిటిక్స్ కి సినిమాకి సంబంధం ఉండకూడదని, సినిమాలు అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ లో గెలవకూడదని పవన్ సిద్ధాంతమేమో కానీ.. పవన్ సినిమాల్లో మాత్రం పొలిటికల్ డైలాగ్స్ మాత్రం ఉండవట.

Advertisement
CJ Advs

ఈమధ్యన దర్శకుడు దేవా కట్టా  పాలిటిక్స్ కి సంబంధం ఉన్న కథతో పవన్ దగ్గరకి వెళితే.. ఆ కథ నచ్చిన పవన్ కి ఆ కథలో కి లింక్ అయ్యి ఉన్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఇష్టం లేకే తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఆ సినిమా చెయ్యమని పవన్ దేవా కట్టాని సాయి తేజ్ దగ్గరకి పంపడం.. మెగా మేనల్లుడు దేవా కట్టా సినిమాని ఓకె చెయ్యడం జరిగిపోయింది. మరి పవన్ కళ్యాణ్ పర్టిక్యులర్ గా సినిమా కథల విషయంలో ఆచి తూచి స్టెప్ తీసుకుంటున్నారు. తాను చేసే సినిమాలు పక్కా ఎంటెర్టైమెంట్ తో కూడిన కథలుగా ఉండాలని పవన్ పట్టుబడుతూ మంచి మంచి కథలని ఒప్పుకుంటున్నాడట పవన్.

Politics means fear for Pawan:

Pawan admitting that the movies have stories that have no link to politics.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs