Advertisement
Google Ads BL

రజనీ చెప్పే రీజన్ మళ్ళీ అదే మాస్టారూ.!


రజినీకాంత్ గనక ఆరోగ్యంగా ఉంటే.. ఈపాటికి తమిళనాడు మొత్తం రజిని రాజకీయ పార్టీ హడావిడిలో ఉండేది.  మీడియా మొత్తం రజిని ఇంటి ముందే ఉండేది. ఆయన కొత్తగా పెట్టబోయే రాజకీయపార్టీ తో తమిళనాడు అంతా హడావిడిగా ఉండేది. మిగతా పొలిటికల్ పార్టీల నేతలు ఒణికిపోయేవారు. కానీ రజినీకాంత్ అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆరోగ్యం పాడవడంతో అన్నాత్తే షూటింగ్ కి బ్రేకిచ్చి చెన్నైకి వెళ్లిపోయారు. అయితే రజినీకాంత్ తీవ్ర ఒత్తిడి కారణంగానే హై బిపి వచ్చిన కారణంగా రజిని కుటుంబ సభ్యులు ముఖ్యంగా రజిని కూతుళ్లు రజిని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పడంతో రజినీకాంత్ రాజకీయాలకు బ్రేకిచ్చేసారు. కొన్నాళ్ళు రాజకీయాలకు బ్రేకిస్తారో లేదంటే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతారో కానీ.. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానులు మాత్రం బాగా డిస్పాయింట్ అయ్యారు. కానీ రజిని మాత్రం కుటుంబాన్ని సాకుగా చూపి పాలిటిక్స్ నుండి త్పపుకున్నారు.

Advertisement
CJ Advs

మళ్ళీ అదే కుటుంబాన్ని సాకుగా చూపిస్తూ ఇప్పుడు రజినీకాంత్ సినిమాలకు శాశ్వతంగా బ్రేకివ్వబోతున్నారనే న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమా తరవాత రజినీకాంత్ కొన్నిరోజుల పాటు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నారట. అయితే కొన్నాళ్లేనా.. లేదంటే శాశ్వతంగానే సినిమాలకు రజిని దూరమవుతారా? అనే విషయంపై రజిని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. రాజకీయాలంటూ ఊరించి ఊరించి సైలెంట్ గా పక్కకు తప్పుకున్న రజిని ఇప్పుడు సినిమాలకు కూడా దూరమవడం ఆయన అభిమానులను నిలవనియ్యడం లేదు. కానీ రజిని మాత్రం ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కారణంగానే సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్. అన్నాత్తే షూటింగ్ కంప్లీట్ కాగానే రజిని కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారని సమాచారం.

Superstar again making excuses for his family:

Rajinikanth to leave movies for a short time or completely leave them?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs