Advertisement
Google Ads BL

మెగా టెంపుల్ సెట్ లో ఆచార్య హల్ చల్


కొరటాల శివ - చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేట ప్రాంతంలో ఓ భారీ సెట్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఆచార్య కోసం కొరటాల - ఆర్ట్ డైరెక్టర్ ఓ భారీ టెంపుల్ సిటీ  సెట్ నిర్మించడం అది కూడా కోకాపేటలోని 20 ఎకరాల్లో నిర్మించడంతో అందరికి ఆ సెట్ పై ఆసక్తి నెలకొంది. ఇంతవరకు ఇండియాలోనే ఇన్ని ఎకరాల్లో ఇలాంటి సెట్ నిర్మాణం జరగలేదని.. దానితో ఆచార్య టెంపుల్ సెట్ నిర్మాణం రికార్డు సృష్టించింది అంటూ న్యూస్ రావడంతో.. అందరిలో ఆ టెంపుల్ సెట్ పై ఆసక్తి పెరిగిపోయింది. దానితో మెగాస్టార్ చిరు ఆ సెట్ నిర్మాణాన్ని తన ఫోన్ లో చిత్రీకరించి మరీ ఆ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆచార్య టెంపుల్ సిటీ సెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

చిరు ఆ వీడియో ని షూట్ చేస్తూ.. ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్. 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలి గోపురం.. ఆశ్చర్యం గొలిపేలా ప్రతి దాన్ని అద్భుతంగా మలిచారు. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చట అనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనే విధంగా  టెంపుల్ సెట్ లో దేవత విగ్రహాల డిజైన్ ని, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రద్దగా చెక్కిన శిల్పాల తో పాటుగా.. చిరు ఆ టెంపుల్ సెట్ విజువలైజ్‌ చేసిన కొరటాల శివకి, అలాగే ఆ సెట్ ని సిద్ధం చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేశ్‌ ని అంత పెద్ద సెట్‌ను వేయడానికి డబ్బులు సమకూర్చిన నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ల ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ ఆ వీడియో ని ట్విట్టర్ లో షేర్ చేసారు చిరు.

 

 

Chiru takes a video at Acharya sets:

<a href="https://www.pinkvilla.com/entertainment/south/chiranjeevi-s-acharya-megastar-shares-video-temple-town-set-koratala-siva-directorial-watch-590424"></a> <h3 class="LC20lb DKV0Md"><span>Megastar shares VIDEO of Acharya temple town</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs