Advertisement
Google Ads BL

జనవరి 14 న తారక్-త్రివిక్రమ్ ఫిల్మ్ లాంచ్


ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగలాంటి వార్త. గత ఏడాది కరోనా తో ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరమైనా రాజమౌళి RRR కొమరం భీం టీజర్ తో ఫాన్స్ కి కిక్కిచ్చాడు. అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ నుండి ఫాన్స్ కి రెండు ట్రీట్ లు వచ్చేలా కనబడుతున్నాయి. ఎందుకంటే RRR ని రాజమౌళి దసరాకి విడుదల చేసే ప్లాన్స్ చేస్తున్నాడనే టాక్ ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కూడా ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లుగా కనబడుతుంది. అసలు సినిమానే మొదలు కాలేదు.. అప్పుడే రిలీస్ డేట్ గురించి మట్లాడేస్తున్నారనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే క్రేజీ మూవీ ఈ సంక్రాంతికి లాంచ్ కాబోతుంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాని జనవరి 14 న సంక్రాంతి రోజున పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టి మార్చ్ చివరి వారం నుండి రెగ్యులర్ షూట్ తో సెట్స్ మీదకెళ్లబోతుందని తెలుస్తుంది. తారక్ - త్రివిక్రమ్ మూవీకి ఎస్. ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అవగా.. హారిక హాసిని నిర్మాతలతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది.. ఈ సినిమా ఓపెనింగ్ రోజున తెలిసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో పై ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు తగ్గట్టుగానే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ ఉండబోతుందని అంటున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ గురించిన మరిన్ని విశేషాలు మరో అప్ డేట్ లో..

Trivikram - Tarak film Launch date locked:

Jr NTR- Trivikram Film Launch Date Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs