Advertisement
Google Ads BL

మహేష్ ఫ్యాన్ గా చైతు.. మరి సమంత..


నాగ చైతన్య - సాయి పల్లవిల లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే చైతన్య మాత్రం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అంటూ సినిమా మొదలు పెట్టేసాడు. అయితే విక్రమ్ చెప్పిన కథలో నాగ చైతన్య మహేష్ బాబు కి వీరాభిమానిగా కనిపించబోతున్నాడట. అంటే మహేష్ సినిమాలు విడుదలవగానే బ్యానేర్స్ కడుతూ హడావిడి చేసే అభిమానిగా చైతూ థాంక్యూ లో కనిపిస్తాడట. మహేష్ వీరాభిమాని.. తర్వాత గొప్పవాడిగా మారి అందరికి ఎలా థాంక్యూ చెప్పాడో అనేది ఈ థాంక్యూ కథగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందట.

Advertisement
CJ Advs

పెళ్లి తర్వాత క్రేజీ జంటగా మారిన నాగ చైతన్య - సమంత ని ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా చూపించాలని.. చైతూ  సరసన సమంత ని నటింప చెయ్యాలని విక్రమ్ థాంక్యూ కథ రాసుకున్నప్పుడే అనుకున్నాడట. తాజాగా దర్శకుడు విక్రమ్ కుమార్ అలాగే సమంత అంటే గురి ఉండే దిల్ రాజు లు కలిసి సమంతని థాంక్యూ కోసం సంప్రదించగా సమంత మాత్రం నో చెప్పిందట. మజిలీ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ గా నటించాం..ఇప్పుడే మళ్ళీ మరో సినిమా ఎందుకు అంటూ దిల్ రాజు - విక్రమ్ కుమార్ ఆఫర్ ని తోసిపుచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. సమంత డెసిషన్ తో చైతూ కూడా అగ్రీ అవడంతో ఇప్పుడు విక్రమ్ కుమార్ కి థాంక్యూ కోసం మరో డెప్త్ ఉన్న హీరోయిన్ ఎంపిక అనివార్యంగా మారిందట.

Chaitu as Mahesh fan, then Samantha?:

Chaitu as Mahesh fan in Vikram Kumar Thank you Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs