బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 5 కి వెళ్లిన కంటెస్టెంట్స్ లో సయ్యద్ సోహెల్ వెండితెర అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇక అరియనా, హరికలకు స్టార్ మా లో స్పెషల్ షో అవకాశాలున్నాయని అంటున్నారు. మరోపక్క అభిజిత్ హీరోగా కథలు వింటున్నాడని.. మంచి అవకాశాలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరోపక్క నేనే నెంబర్ వన్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అయ్యే సత్తా నాకు తప్ప మరెవ్వరికీ లేదనుకున్న అఖిల్ ని బిగ్ బాస్ రన్నర్ గా బయటికి పంపించింది. ఒకప్పుడు టివి సీరియల్స్ లో నటించిన అఖిల్ ప్రస్తుతం వెండితెర అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్నమొన్నటివరకు ఇంటర్వూస్ తో హడావిడి చేసిన అఖిల్ కి వెండితెర ఆఫర్ తగిలింది అని..అది కూడా విలన్ కేరెక్టర్ అంటున్నారు.
హీరో గోపీచంద్ మూవీలో అఖిల్ కి విలన్ ఆఫర్ ఇచ్చారనే టాక్ మొదలయ్యింది. సంపత్ నంది తో గోపీచంద్ చేస్తున్న సీటిమార్ లో అఖిల్ కి సెకండ్ హాఫ్ లో ఓ విలన్ కేరెక్టర్ ని ఇచ్చారనే టాక్ నడుస్తుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోనూ మోనాల్ విషయంలో అభిజిత్ తో తరుచూ నువ్వా నేనా అని గొడవ పడిన అఖిల్ విలన్ గానే చాలామందికి కనిపించాడు. ఇప్పుడు కెరీర్ లోనూ వెండితెర మీద విలన్ గా కనిపించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని ఎడా పెడా వాడకుండా మంచిగా వాడుకుంటా అని.. నాకూ సొంత ప్లాన్స్ ఉన్నాయంటూ చెప్పిన అఖిల్ కి గోపీచంద్ మంచి అవకాశమే ఇచ్చాడంటున్నారు.