Advertisement
Google Ads BL

పార్టీల జోరు మొదలయ్యింది!


బాలీవుడ్ లో పండగలైనా బర్త్ డే పార్టీలైనా ఓ రేంజ్ లో సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి. బడా సెలెబ్రెటీస్ దగ్గరనుండి చిన్న సెలెబ్రెటీస్ వరకు పార్టీల జోరులో తడిచిముద్దవుతారు. కరణ జోహార్ దగ్గర నుండి దీపికా పదుకొనే వరకు, టాప్ హీరోస్ కూడా దివాళీ పార్టీ అని, రంజాన్ పార్టీ అని, పుట్టిన రోజు వేడుకలు అంటూ హోరెత్తించేవారు. గత ఏడాది కరోనా కారణముగా ఈ వేడుకలు చాలా రేర్ గా కనబడ్డాయి. ఇక న్యూ ఇయర్ వేలెబ్రేషన్న్ కోసం ఎవరికీ వారే విడివిడిగా మాల్దీవులు, గోవా, రాజస్తాన్ లాంటి ప్రదేశాలకు వెళ్లగా.. రీసెంట్ గా దీపికా పడుకొనే పుట్టిన రోజు వేడుకలు ముంబై లో ఓ రేంజ్ లో జరిగాయి.

Advertisement
CJ Advs

ఆ వేడుకలకి దీపికా మాజీ ప్రియుడు రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్, అనన్య పాండే లాంటి సెలబ్రిటీస్ హాజరయ్యారు. దీపికా - రణ్వీర్ సింగ్ ఇచ్చిన దీపికా పుట్టిన రోజు పార్టీకి బాలీవుడ్ నుండి చాలామంది సెలబ్రిటీస్ హాజరవడంతో ముంబైలో బాలీవుడ్ లో మళ్ళీ పార్టీల హోరు జోరందుకున్నట్టే. కరోనా లేదు ఏం లేదు.. మొహానికి మాస్క్.. పార్టీ ఎంజాయ్మెంట్ తప్ప అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే ఇలాంటి పార్టీలు బాలీవుడ్ లో తప్ప మరెక్కడా  అంతగా హైలెట్ కూడా కావు. ఇక ఈ వేడుకలకి బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ అందరిని ఆకర్షించే విషయం. అన్నట్టు దీపికా పడుకొనే పుట్టిన రోజునాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీపికా పదుకొనెకి బర్త్ డే విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో ప్రముఖంగా హైలెట్ అయ్యింది.

The parties have begun!:

Deepika Birthday Celebrations in Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs