Advertisement
Google Ads BL

అంతా అనుకున్నట్టు జరిగితే.. జాతరే


రవి తేజ - శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటెర్టైనెర్ క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలకాబోతుంది. రీసెంట్ గా విడుదలైన క్రాక్ సినిమా ట్రైలర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా ట్రేడ్, ప్రేక్షకులు చూపు క్రాక్ వైపే ఉంది. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద ఓ పక్కా మాస్ కమర్షియల్ ఎంటెర్టైనెర్ చూసి చాలా కాలమైంది ప్రేక్షకులకి. ఇన్ని రోజులుగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్ని సినిమాలు చూసినా థ్రిల్లర్స్, చిన్న చిన్న లవ్ స్టోరీస్, లిమిటెడ్ బడ్జెట్ లో చేసిన సినిమాలే తప్ప ఒక బిగ్ స్క్రీన్ స్పేస్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టెనర్ చూసి చాలా కాలమైంది.

Advertisement
CJ Advs

అది ఒక పక్కా మాస్ హీరో చేసి.. ఒక మంచి మాస్ హీరోని బిగ్ స్క్రీన్ మీద చూసి ప్రేక్షకులకి చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా క్రాక్ సినిమాతో ఆడియన్స్ థియేటర్ ఎక్సపీరియెన్స్ చేస్తారని అందరూ నమ్ముతున్నారు. సినిమా మినిమమ్ రిజనబుల్ గా ఉన్నా కూడా హ్యాపీగా హిట్టు సూపర్ హిట్టే అని క్రాక్ యూనిట్ కూడా కాన్ఫిడెన్స్ తో ఉంది. ప్రేక్షకుడికి సినిమా రీజనబుల్ గా అనిపించింది అంటే అది పక్కా హిట్టే. ఒకవేళ మరీ బ్యాడ్ గా ఉంటే మాత్రం శనివారం క్రాక్ సినిమా విడుదల కాబట్టి.. శనివారం, ఆదివారం కలెక్షన్స్ తోనే క్రాక్ సినిమా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక సోమవారం నుండి క్రాక్ కలెక్షన్స్ పడిపోవడం మాత్రం ఖాయం. 

If everything goes as planned, it'll be a festival:

Krack Movie releasing on January 9th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs