Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫాన్స్ కి ప్రామిస్ చేసాడు.. ఇక పండగే


ప్రభాస్ రాధేశ్యాం బడ్జెట్ దాటిపోయింది.. అందుకే ప్రభాస్ ఫీలవుతున్నాడు, రాధేశ్యాం లో ప్రభాస్ లుక్స్ గురించి ఫాన్స్ వర్రీ అవుతున్నారు.. ఇవన్నీ సోషల్ మీడియాలో రాధేశ్యాం పై జరుగుతున్నప్రచారం. ప్రభాస్ కి నాగ్ అశ్విన్ మూవీ, ఆదిపురుష్, సలార్ మూవీ లు ఎక్కువైపోయాయి. అందుకే రాధేశ్యాం పట్టించుకోవడం లేదు అంటూ ప్రచారం జరుగుతుండడం, రాధేశ్యాం అప్ డేట్స్ కోసం ఫాన్స్ ఎదురు చూపులు.. అయినా ప్రభాస్ రాధేశ్యాం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోనే ఉంటుంది. మరి రాధేశ్యాం మొదలు పెట్టి ఎన్నో రోజులు గడిచిపోయినా ఫాన్స్ అప్ డేట్స్ విషయంలో, లుక్స్ విషయంలో, టీజర్ రిలీజ్ విషయంలో ఎదురు చూసి చూసి విసిగిపోయారు. మరోపక్క భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ తమ అప్ డేట్స్ కి కౌన్ డౌన్ స్టార్ట్ చేసి ట్రెండ్ అయ్యేలా చూస్తుంటే ప్రభాస్ రాధేశ్యాం మేకర్స్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండేవారు.

Advertisement
CJ Advs

కానీ ఈసారి ప్రభాస్ ఫాన్స్ కి రాధేశ్యాం దర్శకుడు రాధాకృష్ణ మాటిచ్చేసాడు. ఇప్పటివరకు ప్రభాస్ ఫాన్స్ చేతిలో చిక్కి గిల గిలా కొట్టుకున్న రాధాకృష్ణ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పాడు. త్వరలోనే రాధేశ్యాం టీజర్‌ మీ ముందుకు వస్తుంది. మీ నిరీక్షణకు తగ్గ ఫలితం ఈ టీజర్ ద్వారా మీరు పొందుతారు. ఇది నిజం నన్ను నమ్మండి. రాధేశ్యాం టీజర్‌ చూసాక మీరు చిరునవ్వులు చిందిస్తారు.. అంటూ ప్రభాస్ ఫాన్స్ కి ప్రామిస్ చేసాడు. మరి ఇప్పటివరకు యువి క్రియేషన్స్ వారు అప్ డేట్ అంటూ ఊరించడమే కానీ.. ఎప్పుడూ ఫాన్స్ కి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ రాధాకృష్ణ ఇచ్చిన మాటని నమ్ముతున్నారు. సెలెబ్రేషన్న్ కి సిద్దమవుతున్నారు.

Radhe shyam director promised prabhas fans it will be a festival:

Radheshyam Movie teaser update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs