బాలీవుడ్ లో శ్రీదేవి కూతురుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ధఢక్ సినిమాతో పర్వాలేదనిపించింది.. గుంజన్ సక్సెనాతో తానేమిటో నిరూపించుకుంది. తల్లి చాటు బిడ్డగా పెరిగిన జాన్వీ కపూర్ ప్రస్తుతం సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే బాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే అయినా.. మీడియా ఫోకస్ మొత్తం జాన్వీ కపూర్ మీదే ఉంటుంది. సెలెబ్రిటీ డాటర్, అలాగే హాట్ హీరోయిన్. అందుకే అందరి అటెంక్షన్ ఆమె మీదే. అయితే ఎప్పుడూ జిమ్ వెర్ లోను, చిట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ టాపిక్ అయ్యే జాన్వీ కపూర్ ఇప్పుడు ముంబై లోని కాస్ట్లీ ప్రాంతమైన జుహులో ఓ ఇల్లు కొని మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
అలియా భట్, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ సీలెబ్రిటీస్ అక్కడ జుహు ప్రాంతంలో కోట్లుపోసి ఇల్లు కొనుకున్న ప్రాంతంలో జాన్వీ కపూర్ కూడా 39 కొట్లు పెట్టి ఇల్లు కొనడం హైలెట్ అయ్యింది. ముంబై లోని జుహు భవనంలో మూడు అంతస్తులలో జాన్వీ కపూర్ కొన్న ఇల్లు ఉంది. అయితే ఆ ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్ 7 జరిగినట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. జాన్వీ కపూర్ కొన్న ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు గా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి బాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే అయినా అప్పుడే 39 కోట్లు పెట్టి జాన్వీ కపూర్ ఇల్లు కొనేసిందా అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు.