Advertisement
Google Ads BL

అభిజిత్ పై అఖిల్ షాకింగ్ కామెంట్స్


బిగ్ బాస్ సీజన్ 4 లో ఓ అమ్మాయి గురించి ఇద్దరు అబ్బాయిలు ఎలా కొట్టుకున్నారో చూసాం. మోనాల్ గజ్జర్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి.. ఇద్దరి మధ్య పగని రాజేసింది. అభిజిత్ - అఖిల్ మధ్యన మోనాల్ నిప్పు పెట్టింది. మోనాల్ విషయంలో అఖిల్ - అభిజిత్ లు రెచ్చిపోయి నామినేషన్స్ అప్పుడు ఎంతగా గొడవలు పడ్డారో.. దానికి నాగ్ పీకిన క్లాస్ సాక్ష్యం. మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టడంతో భరించలేకపోయిన మోనాల్ కాస్త డల్ అవ్వగా.. దానికి అఖిల్ ఫీలైపోయి.. అభిజిత్ దగ్గరకి వెళ్లి మోనాల్ కి అభిజిత్ కి మధ్యన ప్యాచప్ చెయ్యాలని చూస్తే అభిజిత్ ప్లీజ్ బాస్ నాక్కొంచెం టైం కావాలని అడిగాడట. అలాగే అఖిల్ ఎన్నిసార్లు అభిజిత్ తో మట్లాడాలని ప్రయత్నించినా అభిజిత్ పట్టించుకోలేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్  కామెంట్స్ చేసాడు అఖిల్. 

Advertisement
CJ Advs

మరి బిగ్ బాస్ హౌస్ లో సీజన్ మొదటి నుండి సీజన్ ముగిసే వరకు ఆభిజీత్ - అఖిల్ కొట్లాట, వారి మధ్యన మన్స్ఫర్ధలు బయటికొచ్చాక కూడా కంటిన్యూ అవుతున్నట్టే కనబడుతుంది వ్యవహారం. ఎందుకంటే అఖిల్ ఎక్కడా అభిజిత్ మాట కానీ, అభిజిత్ ఎక్కడా అఖిల్ మాట కానీ తియ్యడం లేదు. ఇక మోనాల్ - అఖిల్ స్నేహం హౌస్ లో కన్నా బయటే ఎక్కువ నడుస్తుంది. న్యూ ఇయర్ పార్టీ రోజున ఫుల్ జోష్ లో సోహెల్ తో అఖిల్, మోనాల్ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయితే ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో అఖిల్.. అభిజితో స్నేహం చేద్దామని, అతనితో కలిసిపోవాలని చాలా ట్రై చేశాను. కానీ అభిజిత్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అంటూ సంచలనంగా మాట్లాడాడు. మరి అభిజిత్ విన్నరయినప్పుడు అఖిల్ ఎంతగా డిస్పాయింట్ అయ్యాడో బిగ్ బాస్ స్టేజ్ మీద అందరూ చూసారు. ప్రస్తుతం అఖిల్, అభిజిత్ లకి ఆఫర్స్ అంటున్నారే కానీ.. ఎక్కడా క్లారిటీ అయితే లేదు.

Akhil shocking comments on Abhijit:

Bigg boss: Akhil shocking comments on Abhijit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs