Advertisement
Google Ads BL

ముంబై లో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్


బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కొన్నాళ్ళు జైలు పాలయిన సంగతి విదితమే.  సుశాంత్ కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయటికి వచ్చిన రియా చక్రవర్తి ఆమె తమ్ముడు.. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ కొంప ముంచిన సంగతి కూడా తెలిసిందే. రియా బయట పెట్టిన పేర్లలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ద కపూర్ వంటి హీరోయిన్స్ మాత్రమే కాకుండా రియా దోస్త్ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ కూడా డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణను ఎదుర్కొంది. అయితే కొన్నాళ్లుగా ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీ సైలెంటుగానే కనబడుతుంది. మళ్ళీ కొత్త సంవత్సరం లో ముంబైలో డ్రగ్స్ అమ్ముతూ ఓ టాలీవుడ్ నటి ఎన్సీబీ అధికారులకి దొరకడం సంచలనంగా మారింది.

Advertisement
CJ Advs

ముంబ‌యిలోని మీరా రోడ్డులోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించిన ఎన్సీబీ అధికారులకి అక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ డ్రగ్స్ ని పట్టుకున్న క్రమంలో ఓ టాలీవుడ్ నటి అక్కడే ఉన్నట్లుగా, డ్రగ్స్ అమ్ముతూ కనబడడంతో ఆమెని అరెస్ట్ చేసినట్లుగా మీడియాకి తెలిపింది ఎన్సీబీ బృందం. టాలీవుడ్ నటి అని చెబుతున్న హీరోయిన్ ని అలాగే చాంద్ అనే వ్యక్తిని కూడా ఎంసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఆ హోటల్ లో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 లక్షలు పైమాటే అని, నూతన సంవత్సర వేడుకల్లో వాటిని వాడడానికి ముంబైకి తెచ్చినట్టుగా ఎంసీబీ అధికారుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఆ టాలీవుడ్ నటి ఎవరూ అంటూ ఇప్పుడు మీడియా కిందామీద పడుతుంది.

Tollywood Actress Held In Drugs Case:

<span>20-year-old Tollywood actress got arrested in connection with drug racket bust in Mumbai</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs