నిహారిక పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుందేమో.. ఎందుకంటే చేసుకోబోయే వాడు సినిమా ఇండస్ట్రీకి పూర్తి వ్యతిరేకమైన ప్రొఫెషన్ లో ఉన్నాడని అనుకున్నారు. కానీ నిహారిక మాత్రం సినిమా ఇండస్ట్రీని వదిలేలా లేదు. కట్టుకున్న వాడితో పాటుగా.. నిహారిక నిర్మాత అవతారమెత్తబోతుంది అంటున్నారు. పెళ్ళికి ముందే చైతన్య జొన్నలగడ్డ తో రొమాంటిక్ గా రెచ్చిపోయిన నిహారిక పెళ్లి, నిశ్చితార్ధం అన్ని సినిమాటిక్ స్టయిల్లోనే జరిగాయి. పెళ్లి కి ముందు నిహారిక ఎలా ఉందో పెళ్లి తరవాత కూడా అలానే ఉంటుంది అంటూ హింట్ ఇచ్చేసింది. పెళ్లి తర్వాత కూడా రొమాంటిక్ గా గ్లామర్ గానే నిహారిక స్టయిల్ ఉంది. మోడ్రెన్ అమ్మాయిలా సినిమా గ్లామర్ తోనే కనబడుతుంది.
పెళ్ళిలో భర్త తో కలిసి అల్లరి చేసిన నిహారిక పెళ్లి తర్వాత హాని మూన్ లోను చైతన్య తో రొమాంటిక్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేసింది మెగా డాటర్. చైతన్య కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అయినా.. నిహారికతో కలిసి డాన్స్ లు, మెగా ఫ్యామిలీతో మమేకం కావడం అన్ని మెగా ఫాన్స్ ని ఆకట్టుకున్నాయి. అసలైతే నాగబాబు అల్లుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తాడనే టాక్ నడిచింది. ఇక తాజాగా నిహారిక - చైతన్యలు మాల్దీవుల రొమాంటిక్ హనీమూన్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సముద్రపు ఒడ్డున చై తో నిహ అదిరిపోయే ఫోజు ఉన్న ఫోటో తో పాటుగా ఐ సి యు చే అనే క్యాప్షన్ పెట్టి మరీ హాని మూన్ ఫొటోస్ ని ఇన్స్టా లో షేర్ చేసింది. హీరోహీరోయిన్స్ మాదిరి నిహారిక - చై రొమాంటిక్ హాని మూన్ ఫోజులు బాగా వైరల్ అవుతున్నాయి.