Advertisement
Google Ads BL

నాలుగు భారీ సినిమాల్లో ఆఫర్స్ మిస్.?


హాట్ అనసూయ కి నాలుగు భారీ బడ్జెట్ మూవీస్ లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి తప్పిపోయాయట. ఈ విషయాన్ని అనసూయే స్వయంగా చెబుతుంది. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ, రవితేజ ఖిలాడీ సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తున్న అనసూయ కి చిరంజీవి ఆచర్యలోను, అల్లు ఎర్జున్ పుష్ప లాంటి భారీ బడ్జెట్ మూవీస్ లో అవకాశాలొచ్చాయనే టాక్ ఉంది. పుష్ప లో డీ గ్లామర్ రోల్ చెయ్యనని అనసూయ తప్పుకుంది అనే ప్రచారం జరిగింది. కానీ అనసూయ వెర్షన్ లో సినిమా ఇండస్ట్రీలో ఫెవరేటిజం ఉన్న కారణంగానే తనకి సినిమా అవకాశాలు పోయాయని అంటుంది. ఇండస్ట్రీలో కంటికి, బయటికి కనబడని ఫెవరేటిజం ఉందంటుంది.

Advertisement
CJ Advs

అసలు మనం సినిమాల్లో నటించాక.. ఆ పాత్ర తాలూకు నిడివి సినిమా విడుదలయ్యాక ఉంటుంది అనే విషయంలో క్లారిటీ ఉండదంటుంది. షూటింగ్ ఫినిష్ అయ్యాకే అసలు కథ మొదలవుతుంది అని, సినిమా విడుదలై అందులో మనం కనిపించే వరకు టెంక్షన్ గానే ఉంటుంది అంటుంది అనసూయ. మరి చాలామంది అనసూయ లాగే మేము సినిమాలో నటించాము.. కానీ సినిమా విడుదలయ్యాక లేము అంటున్నట్టే అనసూయ కూడా చెబుతుంది. ఇక తనకి నాలుగు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చి చేజారాయని, తనకు ఇస్తా అన్న పాత్రలోకి తీసుకున్న వాళ్ళు తనకంటే గొప్ప వాళ్ళు కాదని, తనకన్నా బాగా నటించేవాళ్ళు కాదని అయినా వాళ్ళకే అవకాశం వచ్చింది అంటుంది. మరి అనసూయని తప్పించిన ఆ నాలుగు పెద్ద సినిమాలు ఏమై ఉంటాయబ్బా.. అని ఇప్పుడు నెటిజెన్స్  తెగ ఆలోచించేస్తున్నారు.

She lost her film opportunities because of favoritism!!:

Anasuya lost 4 films?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs