Advertisement
Google Ads BL

పవన్ వరమిచ్చినా.. కరోనా కనికరించలేదు


పవన్ కళ్యాణ్ ఈమధ్యన ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నాడు. వరసబెట్టి ఒప్పుకున్న సినిమాల కోసం పవన్ ఎప్పుడు వస్తాడో తెలియదు.  ఎలాగో వేణు శ్రీరామ్ - దిల్ రాజు ల వకీల్ సాబ్ ని పూర్తి చేసి వేరే సినిమాల కోసం రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినా వాటిని ఎలా వాడతాడో పవన్ కే క్లారిటీ ఉండదు. వకీల్ సాబ్ ప్యాకప్ చెప్పకముందే శేఖర్ కె చంద్ర తో అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ మొదలు పెట్టాడు. ఇక రేపు సోమవారం నుండి క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి పవన్ రెడీ అవుతున్నాడు. అంటే క్రిష్ సినిమాకి పవన్ వరమిచ్చినట్టే. మొదటి షెడ్యూల్ లాక్ డౌన్ ముందు పూర్తి చేసిన క్రిష్ పవన్ తో సెకండ్ షెడ్యూల్ కోసం వెయిటింగ్.

Advertisement
CJ Advs

ఎట్టకేలకు పవన్ కరుణించాడు. కానీ కరోనా కి కనికరం లేదు. పవన్ తో కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవడం, సెట్ పనులు కూడా పూర్తి చేసుకున్న క్రిష్ సోమవారం నుండి పవన్ సినిమా షెడ్యూల్ మొదలు పెట్టేముందు కరోనా టెస్ట్ చేయించుకోగా.. క్రిష్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దానితో క్రిష్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు. అంటే 14 రోజుల పాటు క్రిష్ బయటికి రాడు. దానితో క్రిష్ - పవన్ షూటింగ్ వాయిదా పడినట్లే. అసలే పవన్ కరుణించాడు కదా అని ఉత్సాహ పడే లోపు క్రిష్ ని కరోనా కాటేసింది. అందుకే అంటారు దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డం పడ్డాడు అని. ఇప్పుడు క్రిష్ విషయంలో అదే జరిగింది. పవన్ వరమిచ్చినా కరోనా కనికరించలేదు. పాపం క్రిష్.

Although Pawan blessed him, but Corona had other plans for him:

<h1>Krish Tests Covid Positive- Pawan movie paused</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs