Advertisement
Google Ads BL

సైలెంట్ గా భలే ట్విస్ట్ ఇచ్చింది


తెలుగులో పెళ్లి తర్వాత కూడా అవకాశాల జోరులో తడిచిన అక్కినేని సమంత.. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల జోలికి రావడం లేదు. సమంత ప్లాన్స్ మారాయో.. లేదంటే అవకాశాలు తగ్గాయో అనుకోవడానికి లేదు. సమంత సై అంటే ఆమె వాకిట్లో దర్శకనిర్మాతలు క్యూ ఉంటుంది. కానీ సమంత ఆచి తూచి సినిమాలు చేస్తుంది. తనకు నచ్చితేనే ఓకె చెబుతుంది. తమిళంలో విజయ్ సేతుపతి - నయనతారలతో నటిస్తున్న సమంత తెలుగు విషయంలో గప్ చుప్ గా ఉంటుంది. ఆహా టాక్ షో సామ్ జామ్ తో హడావిడి చేస్తున్న సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాకి వెళ్ళింది. గ్లామర్ షో లో వెనకడుగు వెయ్యని సమంత సైలెంట్ గా కనబడుతూనే అందరికి అదిరిపోయే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

Advertisement
CJ Advs

అది గుణశేఖర్ శాకుంతలం పాన్ ఇండియా మూవీకి సమంత సైన్ చేసింది. కనీసం గాసిప్ కూడా లేని న్యూస్.. ఇప్పుడు అధికారికం అయ్యింది. గుణశేఖర్ శాకుంతలం హీరోయిన్ గా పూజ హేగ్డ్ పేరు వినిపిస్తున్న తరుణంలో న్యూ ఇయర్ రోజున గుణ టీం వర్క్స్ వారు సమంత ని శకుంతలగా ప్రకటించి షాకిచ్చారు. సమంత హీరోయిన్ గా శాకుంతలం పాన్ ఇండియా మూవీ అనగానే అందరికి షాక్. సైలెంట్ గా సమంత ఇలా పనికానిచ్చేసిందిగా అంటున్నారు. మరి సమంత శాకుంతలం మెయిన్ లీడ్ అనగానే సినిమాపై అప్పుడే అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అయితే శకుంతలగా సమంత ఫైనల్ అయితే.. ఈ సినిమాలో దుష్యంతుడుగా ఎవరు కనిపిస్తారనే దాని మీద చర్చలు మొదలైపోయాయి.

Gunasekhar revealed the Shakuntalam Heroine:

Samantha plays Sakuntala role in Gunasekhar Shakuntalam movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs