Advertisement
Google Ads BL

ఇండైరెక్ట్ గా అభిజిత్ పై మోనాల్ హాట్ కామెంట్స్


బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిపోయింది. కానీ అందులోకి వెళ్లిన కంటెస్టెంట్స్ కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరుకాయల మాదిరిగా వెలిగిపోతుంది. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి చేతిలో అవకాశాల జోరు ఉందనే ప్రచారం ఉండగా.. సోహైల్ హీరోగా సినిమా మొదలైపోయింది. మరోపక్క బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ మోనాల్ గజ్జర్ అయితే ఓ ఐటెం సాంగ్ అలాగే డాన్స్ ప్లస్ షో కి జేడ్జ్ గా అదరగొట్టేస్తుంది. మోనాల్ బయటికి రావడం రావడమే అదిరిపోయే ఆఫర్స్ తో బయటికి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ క్వీన్ గా, అఖిల్ ప్రేయసిగా కనబడిన మోనాల్ అందరికన్నా ఎక్కువగా స్క్రీన్ స్పేస్ సంపాదించుకుంది. అఖిల్ - అభిజిత్ లతో స్నేహం చేసిన మోనాల్ ని అఖిల్ లవర్ గా ప్రాజెక్ట్ చేసింది బిగ్ బాస్. అలాగే అభిజిత్ తో మోనాల్ కి పొసగ లేదు. అప్పటినుండి అభిజిత్ మోనాల్ ని దూరం పెట్టేసాడు.

Advertisement
CJ Advs

మోనాల్ ఎంతగా అభిజిత్ కి దగ్గరవుదామనుకున్నా అభిజిత్ అందుకు అవకాశం ఇవ్వకపోయేసరికి మోనాల్ అఖిల్ తో సర్దుకుపోయింది. అయితే మోనాల్ - ఆఖిల్ జంటగా మారతారనుకుంటే మేం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కలరింగ్ ఇస్తున్నారు. మేము చాలా ఫ్రెండ్లిగా ఉండేవాళ్ళం.. అంటూ మోనాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. అయితే అభిజిత్ విన్నర్ అవడం, అఖిల్ రన్నర్ అయినప్పుడు మోనాల్ ఫేస్ చూసిన చాలామంది మోనాల్ కి అభిజిత్ విన్నరవడం నచ్చలేదని అన్నట్టుగానే మోనాల్ తాజాగా అభిజిత్ పై ఇండైరెక్ట్ గా హాట్ హాట్ వ్యాఖ్యలు చేసింది. నేను అఖిల్ ఫ్రెండ్లీ గా మా గేమ్ మేము ఆడాము. కానీ మమ్మల్ని జంటగా చూపించారు. కొంతమంది జంటలుగా, గ్రూప్ లుగా బిగ్ బాస్ గేమ్ ఆడారు. వాళ్ళు చివరి వరకు అలానే ఆడారు, ఉన్నారు అంటూ అభిజిత్ అండ్ హరికలపై మోనాల్ ఇండైరెక్ట్ గా పంచ్ లు వేసింది. 

Monal hot comments on Abhijeet indirectly:

Monal hot comments on Abhijeet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs